రేపటి నుంచి మూడు రోజుల పాటు విశాఖలో జగన్

  • మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్
  • ఒక రోజు ముందే విశాఖ చేరుకోనున్న సీఎం
  • పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడమే ప్రభుత్వ లక్ష్యం
ఏపీ ముఖ్యమంత్రి జగన్ రేపు విశాఖకు వెళ్లనున్నారు. మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరగనుంది. ఈ సమ్మిట్ లో పాల్గొనేందుకు వెళ్తున్న జగన్ ఒక రోజు ముందే విశాఖకు చేరుకోనున్నారు. మూడు రోజుల పాటు ఆయన విశాఖలోనే బస చేయనున్నారు. గ్లోబల్ సమ్మిట్ ముగిసిన తర్వాత ఆయన తిరిగి తాడేపల్లిలోని నివాసానికి చేరుకోనున్నారు.

ఇక ఈ సమ్మిట్ వేదికగా పారిశ్రామికవేత్తలకు రాష్ట్రంలోని వనరుల గురించి వివరించి, పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సమ్మిట్ కు మన దేశం నుంచే కాకుండా విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలను కూడా ప్రభుత్వం ఆహ్వానించింది. ఢిల్లీలో నిర్వహించిన ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సన్నాహక సదస్సులో కూడా జగన్ పాల్గొన్న సంగతి తెలిసిందే. మరోవైపు విశాఖ రాజధానిగా పాలన జరపాలని జగన్ భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్లోబల్ సమ్మిట్ ను ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.


More Telugu News