ఇదేనా జగన్ దమ్ము?: కన్నా లక్ష్మీనారాయణ
- పోలీసులను అడ్డం పెట్టుకుని జగన్ పాలన చేస్తున్నారన్న కన్నా
- ప్రశ్నించే వారిపై కేసులు పెడుతున్నారని విమర్శ
- దమ్ముంటే డబ్బు, మద్యం పంచకుండా ఎన్నికలకు రావాలని సవాల్
175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను పోటీ చేయించే ధైర్యం ఉందా? అని టీడీపీ అధినేత చంద్రబాబుకు, జనసేనాని పవన్ కల్యాణ్ కు ఏపీ ముఖ్యమంత్రి జగన్ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. చంద్రబాబుకు, ఆయన దత్తపుత్రుడికి గెలిచే దమ్ముందా అని జగన్ ఛాలెంజ్ చేశారు.
ఈ నేపథ్యంలో టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ స్పందిస్తూ... జగన్ కు ఉన్న దమ్ము ఏందని ప్రశ్నించారు. ప్రతిపక్షాల నోరు నొక్కడం, పోలీసులను అడ్డం పెట్టుకుని పాలన చేయడం... ఇదేనా జగన్ దమ్ము అని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే ప్రతి ఒక్కరిపై కేసులు పెడుతున్నారని... ఇదేనా జగన్ జగన్ దమ్ము అని అన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్లు ఏదైనా కార్యక్రమం చేస్తే... రాత్రికి వాళ్ల ఆస్తులు తగులబెడుతున్నారని మండిపడ్డారు.
జగన్ కు నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే... డబ్బు, మద్యం పంచకుండా ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. నీవు అమలు చేస్తున్న నవరత్నాలపై నిజంగా నమ్మకం ఉంటే సక్రమ పద్ధతిలో ఎన్నికలకు రావాలని జగన్ కు సవాల్ విసిరారు. కులం, మతం అనేది చూడకుండా పరిపాలన చేశానని చెప్పి ప్రజలను ఓట్లను అడిగే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. ప్రజావ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకే విమర్శలు చేస్తూ సవాళ్లు విసురుతున్నారని అన్నారు.