అనుష్క న్యూ మూవీ టైటిల్ ఇదే!
- యూవీ బ్యానర్లో 'మిస్ శెట్టి - మిస్టర్ పోలిశెట్టి'
- ప్రధానమైన పాత్రల్లో అనుష్క - నవీన్ పోలిశెట్టి
- కామెడీ ప్రధానంగా సాగే కథ
- తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో రిలీజ్
'సైలెన్స్' తరువాత అనుష్క ఇంతవరకూ మరో సినిమా చేయలేదు. దాంతో ఇకపై ఆమె సినిమాలు చేయకపోవచ్చనే టాక్ కూడా వచ్చింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో .. నవీన్ పోలిశెట్టి కాంబినేషన్లో ఆమె ఒక సినిమా చేయనుందనే వార్తలు షికారు చేశాయి. అయితే అందుకు సంబంధించిన అప్ డేట్స్ మాత్రం రాలేదు.
ఈ నేపథ్యంలో ఈ సినిమాకి టైటిల్ ను ఖాయం చేస్తూ, ఒక పోస్టర్ ను వదిలారు. ఈ సినిమాకి 'మిస్ శెట్టి - మిస్టర్ పోలిశెట్టి' అనే టైటిల్ ను ఖరారు చేశారు. వారి అసలు పేర్లతో టైటిల్ సెట్ చేయడాన్ని విశేషంగానే చెప్పుకోవాలి. అనుష్కను ఫారిన్ బ్యాక్ గ్రౌండ్ లోను .. నవీన్ పోలిశెట్టిని నేపథ్యంలోను చూపించారు.
తాను సింగిల్ గా ఉండటానికే ఇష్టపడుతున్నట్టుగా అనుష్క చెబుతుంటే, తాను మాత్రం కలవడానికీ .. ప్రేమ పేరుతో కలిసి పోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా నవీన్ పోలిశెట్టి చెబుతున్నాడు. మహేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను, ఈ వేసవిలో తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు.