కిరణ్ అబ్బవరం హీరోగా 'మీటర్' .. రిలీజ్ డేట్ ఇదే!

కిరణ్ అబ్బవరం హీరోగా 'మీటర్' .. రిలీజ్ డేట్ ఇదే!
  • కిరణ్ అబ్బవరం నెక్స్ట్ మూవీగా 'మీటర్'
  • పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న కిరణ్ 
  • దర్శకుడిగా రమేశ్ పరిచయం 
  • కథానాయికగా అతుల్య రవికి ఇదే ఫస్టు మూవీ
  • ఏప్రిల్ 7వ తేదీన సినిమా రిలీజ్
కిరణ్ అబ్బవరం నుంచి వచ్చిన 'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమా విజయాన్ని అందుకుంది. గీతా ఆర్ట్స్ 2 నుంచి వచ్చిన ఈ సినిమా, మంచి వసూళ్లను రాబట్టింది. ఈ నేపథ్యంలో ఆ తరువాత సినిమా అయిన 'మీటర్' పై ఆయన పూర్తి దృష్టి పెట్టాడు. ఒక విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. 

క్లాప్ - మైత్రీ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి, రమేశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. కొంతసేపటి క్రితం ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. అదే విధంగా కిరణ్ అబ్బవరం లుక్ కి సంబంధించిన పోస్టర్ ను వదిలారు. ఏప్రిల్ 7వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాలో కిరణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.     

రొమాంటిక్ టచ్ తో కూడిన యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. సాయికార్తీక్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఈ సినిమాతో అతుల్య రవి కథానాయికగా తెలుగు తెరకి పరిచయమవుతోంది. 2017లోనే కోలీవుడ్ కి పరిచయమైన ఈ బ్యూటీ, ఈ సినిమాతో ఇక్కడ ఎన్ని మార్కులు కొట్టేస్తుందనేది చూడాలి.


More Telugu News