నా జీవితంలో ఎంతో అద్భుతమైన క్షణాలివి: రామ్ చరణ్
- ఈ నెల 12న లాస్ ఏంజిల్స్ లో ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం
- 'ఆర్ ఆర్ ఆర్'కి దక్కిన ఘనతను గురించి చరణ్ ప్రస్తావన
- 'నాటు నాటు' డాన్స్ కోసం పడిన కష్టం గురించి వివరణ
- ఆస్కార్ రేసులో ఈ పాట ఉండటం పట్ల హర్షం
లాస్ ఏంజిల్స్‌లో ఈ నెల 12న 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. దాంతో అక్కడ చరణ్ సందడి చేస్తున్నాడు. ఇటీవలే 'గుడ్ మార్నింగ్ అమెరికా' షోతో పాటు ఏబీసీ న్యూస్ వాళ్లు నిర్వహించిన ఇంటర్వ్యూస్‌లో పాల్గొన్న రామ్ చరణ్, ఇప్పుడు లాస్ ఏంజిల్స్ వైబ్స్‌లో మునిగి తేలుతున్నాడు. ఈ నేపథ్యంలో అక్కడి పాప్యులర్ ఎంటర్‌టైన్మెంట్ ఛానల్ KTLA రామ్ చరణ్‌ను ఇంటర్వ్యూ చేసింది.
* RRR చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన రెస్పాన్స్ రావడం పట్ల మీరెలా స్పందిస్తున్నారు?
- మా డైరెక్టర్ రాజమౌళిగారు రాసిన అత్యుత్తమ చిత్రాల్లో RRR ఒకటి. ఇందులో చాలా జోనర్స్ మిళితమై ఉన్నాయి. ఇద్దరి హీరోల మధ్య ఉన్న సోదర అనుబంధాన్ని ఎలివేట్ చేసిన తీరు చక్కగా కుదిరింది. ఇది అల్లూరి - భీమ్ అనే ఇద్దరు యువకుల మధ్య ఉండే స్నేహాన్ని తెలియజేస్తూనే, భారతదేశం ఎదుర్కొన్న వలసవాద అణచివేతకు వ్యతిరేకంగా చేసిన పోరాటం గురించి కూడా తెలియజేస్తుంది. సెంటిమెంట్స్‌ను టచ్ చేస్తుంది.
*‘నాటు నాటు’ పాటలో మెరుపులా సాగే డాన్స్, అద్భుతమైన మ్యూజిక్ ఆడియెన్స్‌ను అలరించాయి. ఆ పాటను చేసే క్రమంలో మీలో అది ఉత్సాహాన్ని నింపిందా? లేదా నిరుత్సాహంగా అనిపించిందా?
- నేనెప్పుడూ చిన్నపిల్లాడిలా డాన్స్ చేయలేదు. నాకు నిర్మాత మంచి రెమ్యూనరేషన్‌ను ఇచ్చారు (నవ్వుతూ) కాబట్టి నేను తప్పకుండా డాన్స్ చేయాల్సిందే. ‘నాటు నాటు’ అనేది చాలా అందమైన సాంగ్స్‌లో ఒకటి. ఈ పాట చిత్రీకరణ సమయంలో సెట్‌లో దాదాపు 300 మంది ప్రొఫెషనల్ డ్యాన్సర్లు ఉన్నారు. 7 రోజుల రిహార్సల్ తర్వాత 17 రోజుల పాటు పాటను చిత్రీకరించారు. ప్రేక్షకులు నేను మంచి డాన్సర్ అని భావిస్తారు. వారి అంచనాలను నిలబెట్టుకోవలసి వచ్చింది.
* ఆస్కార్ వేడుకల్లో లైవ్ పెర్ఫామెన్స్ గురించి తెలియచేయండి..
- ఇప్పటికీ వరకు ప్రేక్షకులు మాకు చాలానే ఇచ్చారు. పాటను ఆస్కార్ వేడుకల్లో లైవ్‌లో ప్రదర్శించడం ద్వారా ప్రేక్షకులకు నా ప్రేమను చూపించడం అనేది ఓ మార్గం. అలా చేయటం నేను వారికిచ్చే రిటర్న్ గిఫ్ట్.
* 'నాటు నాటు' సాంగ్‌కి గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో పాటు పలు అంతర్జాతీయ అవార్డులు రావటం ఆస్కార్‌కి ఎంపిక కావటం ఎలా అనిపిస్తుంది?"
- నా జీవితంలో ఇవి అద్భుతమైన క్షణాలు. ఆస్కార్ వేడుకల్లో నేను ఓ అతిథిగా ఉండాలనుకున్నాను. ఇప్పుడు నామినేట్ అయ్యాను. నేను ఆ బ్లాక్ లేడీని మా టీమ్‌తో కలిసి మా దేశానికి తీసుకెళ్లటానికి చాలా ఎగ్జయిట్మెంట్‌తో ఎదురు చూస్తున్నాను. మార్చి 3న మా సినిమా యు.ఎస్‌లో రీ రిలీజ్ అవుతుంది. సినిమా కచ్చితంగా మిమ్మల్ని నిరాశ పరచదని భావిస్తున్నాను.
* ఆస్కార్ రేసులో మీ పాట ఉండటంపై మీరెలా భావిస్తున్నారు?
- ఓ నటుడిగా అవి నాకెంతో సంతృప్తిని కలిగించే క్షణాలు. మా ఇండియన్ సినిమాలో తెలుగు సినీ పరిశ్రమకు 85 ఏళ్ల చరిత్ర ఉంది. ఇప్పుడు మీరు మమ్మల్ని గుర్తించారు. మా సినిమా ఎంతో బాగుందని అప్రిషియేట్ చేశారు. నేను వివిధ దేశాల్లో ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇండస్ట్రీలో మా మార్క్ చూపించటానికి ఇదే సరైన తరుణంగా భావిస్తున్నాం" అంటూ చెప్పుకొచ్చాడు.