69 ఏళ్లు వచ్చాయి.. ముసలోడిని అవుతున్నా: కేసీఆర్

  • బాన్సువాడ అభివృద్ధికి పోచారం ఎంతో కృషి చేశారన్న కేసీఆర్
  • ఆయన ఇంకెంతో కృషి చేయాలని ఆకాంక్షించిన సీఎం
  • ఉమ్మడి ఏపీలో ప్రజలు, రైతులు అనేక సమస్యలను ఎదుర్కొన్నారని వ్యాఖ్య
బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధికి పోచారం శ్రీనివాసరెడ్డి ఎంతో కష్టపడ్డారని ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు. నియోజకవర్గ అభివృద్ధికి ఆయన ఇంకెంతో కృషి చేయాలని ఆకాంక్షించారు. పోచారం వయసు పెరుగుతోందని... అయినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. తనకు కూడా 69 ఏళ్లు వచ్చాయని... ముసలోడిని అవుతున్నానని చెప్పారు. బాన్సువాడకు రూ. 50 కోట్లు మంజూరు చేస్తామని తెలిపారు. 

కామారెడ్డి జిల్లా తిమ్మాపూర్ గ్రామంలో శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవంలో కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఇక్కడకు వచ్చినప్పుడు ఆలయ పరిస్థితి బాగోలేదని... ఆలయాన్ని అభివృద్ధి చేయాలని అప్పట్లోనే అనుకున్నామని చెప్పారు. పోచారం శ్రీనివాసరెడ్డి కూడా కొందరు మిత్రులతో వచ్చి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని తనను కోరారని తెలిపారు. ఉమ్మడి ఏపీలో ప్రజలు, రైతులు అనేక సమస్యలను ఎదుర్కొన్నారని... తెలంగాణ ఉద్యమానికి ఇది కూడా ఒక కారణమని చెప్పారు.


More Telugu News