టాలీవుడ్ నే నమ్ముకున్న మాళవిక నాయర్!
- కంటి చూపులతోనే కట్టిపడేసే మాళవిక నాయర్
- తెలుగు సినిమాలపై మాత్రమే దృష్టిపెట్టిన బ్యూటీ
- యూత్ లో పెరిగిపోతున్న ఫాలోయింగ్
- రిలీజ్ కి రెడీ అవుతున్న మరో రెండు సినిమాలు
మాళవిక నాయర్ .. ఢిల్లీలో పుట్టిపెరిగిన ఈ బ్యూటీ, మలయాళ సినిమాల ద్వారా 2012లో తన కెరియర్ ను మొదలుపెట్టింది. ఆ తరువాత కోలీవుడ్ ను కూడా టచ్ చేసిన మాళవిక, 2014లో 'ఎవడే సుబ్రమణ్యం' సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆకర్షణీయమైన కళ్లతో .. అందమైన చూపులతో ఈ సుందరి యూత్ హృదయాలను కొల్లగొట్టింది.
సాధారణంగా మలయాళం .. తమిళం సినిమాల నుంచి వచ్చిన వారు అక్కడి సినిమాలు చేస్తూనే, వీలును బట్టి ఇక్కడ కూడా మెరుస్తూ ఉంటారు. కానీ మాళవిక నాయర్ మాత్రం అలా కాదు, తెలుగు తెరతో పరిచయమైన దగ్గర నుంచి ఆమె మరో మలయాళ సినిమాగానీ .. తమిళ సినిమా గాని చేయలేదు. పూర్తిగా తెలుగు సినిమాలపైనే దృష్టి పెట్టింది.
'కల్యాణ వైభోగమే' .. 'విజేత' .. 'ఒరేయ్ బుజ్జిగా' వంటి సినిమాలు చేసిన మాళవిక, 'థ్యాంక్యూ' సినిమాలో గ్లామర్ పరంగా ఎక్కువ మార్కులు కొట్టేసింది. ఆమె చేసిన 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' .. 'అన్నీ మంచి శకునములే' సినిమాలు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ సినిమాలతో ఆమె ఇక్కడ మరింత బిజీ అవుతుందేమో చూడాలి.