ఆస్కార్ వేదికపై ‘నాటునాటు’.. రాహుల్ సిప్లిగంజ్ లైవ్ ప్రదర్శన

  • ధ్రువీకరించిన రాహుల్ సిప్లిగంజ్
  • ఈ నెల 12న రాహుల్, కాలభైరవ సంయుక్త ప్రదర్శన
  • అరుదైన అవకాశం పట్ల అభినందనలు
గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ లకు అరుదైన అవకాశం ఎదురొచ్చింది. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ఆస్కార్ అవార్డుల నామినేషన్లకు అర్హత సాధించడం తెలిసిందే. ఈ నెల 12న అకాడమీ 95వ అవార్డుల కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో నాటు నాటు గేయ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఈ పాటను కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. దీంతో రాహుల్, కాలభైరవతోనే లైవ్ ప్రదర్శన ఏర్పాటు చేశారు. 

ఈ విషయాన్ని రాహుల్ సిప్లిగంజ్ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశాడు. ‘‘ఇది నా జీవితంలో మరిచిపోలేని క్షణం’’ అని పేర్కొన్నాడు. దీంతో ఎంతో మంది నుంచి అభినందనలు వస్తున్నాయి. నాటు నాటు పాటకు కచ్చితంగా ఆస్కార్ అవార్డు వస్తుందన్న అంచనాలు బలంగా ఉన్నాయి. అందుకే రాజమౌళి, కీరవాణి, రామ్ చరణ్ సహా కీలక చిత్ర బృందం ఇప్పటికే అమెరికాకు చేరుకోగా, జూనియర్ ఎన్టీఆర్ సైతం అవార్డుల కార్యక్రమానికి హాజరుకానున్నాడు. 
 


More Telugu News