సింహం లాంటి ముఖం.. ఇది ఏ జంతువో చెప్పగలరా?

  • ట్విట్టర్ లో వీడియో పోస్ట్ చేసిన ఐఎఫ్ఎస్ అధికారి కశ్వాన్
  • లడఖ్ ప్రాంతంలో అందమైన, అరుదైన జంతువుగా పేర్కొన్న అధికారి
  • లింక్స్ అంటూ బదులిస్తున్న యూజర్లు
జంతు ప్రపంచం చాలా పెద్దది. మనకు తెలిసిన జంతువులు చాలా తక్కువ. అలాంటి తెలియని ఓ జంతువు గురించి పరిచయం చేశారు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి ప్రవీణ్ కశ్వాన్. ‘‘భారత్ లో ఓ అందమైన, అరుదైన జంతువు. లడఖ్ రీజియన్ లో.. చాలా మంది దీని గురించి విని ఉండరు. ఊహించండి?’’ అంటూ సదరు జంతువు వీడియోని పోస్ట్ చేశారు కశ్వాన్.

ఈ జంతువు ముఖం అచ్చం సింహం మాదిరిగా ఉండడాన్ని గమనించొచ్చు. ప్రవీణ్ కశ్వాన్ ఊహించండి? అన్న ప్రశ్నకు కొందరు యూజర్లు స్పందిస్తున్నారు. దీన్ని హిమాలయన్ లింక్స్ అని, యూరేషియన్ లింక్స్ అని కొందరు కామెంట్ చేశారు. ‘‘లింక్స్ భారత్ లోనూ కనిపిస్తుందని తెలియదు’’ అని మరో యూజర్ పేర్కొన్నారు.

లింక్స్ అన్నది పిల్లి జాతికి చెందినది. యూరప్, ఆసియా, నార్త్ అమెరికా అడవుల్లో కనిపిస్తుంది. పక్షులు, ఇతర చిన్న పాటి జంతువులు దీని ఆహారం.


More Telugu News