ట్విట్టర్ కు పోటీగా బ్లూ స్కై.. ఐవోఎస్ వెర్షన్

  • అభివృద్ధి చేసిన జాక్ డోర్సే
  • ప్రస్తుతం బీటా టెస్టింగ్ దశలో
  • త్వరలోనే అందరికీ అందుబాటులోకి
  • ట్విట్టర్ మాదిరే యూజర్ ఇంటర్ ఫేస్
ట్విట్టర్ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే.. దానికి పోటీగా మరో షోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘బ్లూ స్కై’ని తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బ్లూ స్కై యాప్ ను ఇప్పటికే యాపిల్ ఐవోఎస్ పై పరీక్షిస్తున్నారు. యాపిల్ యాప్ స్టోర్ లో బ్లూ స్కైని గుర్తించొచ్చు. గతేడాది ట్విట్టర్ లో తన వాటాలను టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కు విక్రయించేసిన జాక్ డోర్సే అప్పటి నుంచి బ్లూ స్కై అభివృద్ధిపై దృష్టి పెట్టారు.

ట్వట్టర్ మాదిరే దీనికీ బ్లూ రంగు అద్దారు జాక్ డోర్సే. ఇది కూడా మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫామ్ కావడం గమనించాలి. యాప్ స్టోర్ లో ఉన్నప్పటికీ, ఇన్విటేషన్ ఉన్నవారే దీన్ని ఇన్ స్టాల్ చేసుకుని వాడుకోవడానికి వీలుంటుంది. బీటా టెస్ట్ తర్వాత బ్లూ స్కై త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది. డీసెంట్రలైజ్డ్ సోషల్ మీడియా ప్రోటోకాల్ గా దీన్ని డిజైన్ చేశారు. ఫిబ్రవరి 17న యాప్ స్టోర్ లోకి వచ్చిన బ్లూస్కై యాప్ ను 2,000 మంది ఇన్ స్టాల్ చేసుకుని పరీక్షిస్తున్నట్టు సమాచారం. యూజర్ ఇంటర్ ఫేస్ ట్విట్టర్ మాదిరే ఉండనుంది.


More Telugu News