ఈ కింగ్ కోబ్రా ఎదురుగా వస్తే గుండె ఆగిపోతుందేమో..!

  • భారీ కింగ్ కోబ్రా వీడియోని షేర్ చేసిన ఐఎఫ్ఎస్ అధికారి నందా
  • 20 అడుగులకు పైగా పొడవున్న పాము
  • తాను స్వయంగా చూశానన్న ఓ యూజర్
నాగు పాము (కింగ్ కోబ్రా)ను చాలా మంది చూసి ఉంటారు. మన దగ్గర కనిపించే పాములు మహా అయితే 10 అడుగుల వరకే ఉంటాయి. కానీ, 20 అడుగులకు పైగా పొడవైన, పెద్ద పరిమాణంలో ఉన్న కింగ్ కోబ్రాను ఎప్పుడైనా చూశారా..? అలాంటి ఓ భారీ కింగ్ కోబ్రా వీడియోని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత్ నందా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. 

కింగ్ కోబ్రా పది అడుగుల మేర పైకి లేచి గమనిస్తూ ఉండడాన్ని చూడొచ్చు. ఈ పాము తన శరీరంలో మూడింట ఒకటో వంతు వరకు నిలబడగలదని, ఎదురుగా ఉన్న వ్యక్తి కళ్లల్లోకి చూడగలదని నందా వెల్లడించారు. దీనికి సింహ అనే ట్విట్టర్ యూజర్ స్పందిస్తూ ‘‘నేను, మా నాన్న కొన్నేళ్ల క్రితం ఊళ్లో ఇలాంటి కోబ్రాను చూసి వణికిపోయాం. వెనుదిరిగి పరుగెత్తుకుంటూ ఇంటికి వచ్చేశాం’’అని కామెంట్ చేశాడు. సుశాంత్ నందా అటవీ జంతువుల గురించి ఇలా అరుదైన విశేషాలను తరచూ ట్విట్టర్ పై షేర్ చేస్తుంటారు. 




More Telugu News