ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. కేఎల్ రాహుల్ ఔట్!
- అనుకున్నట్టే రాహుల్‌ను తప్పించి శుభమన్ గిల్‌కు చోటు
- పరువు కోసం ఆస్ట్రేలియా.. డబ్ల్యూటీసీలో చోటు కోసం భారత్ పోరు
- తొలి రెండు టెస్టుల్లోనూ భారత్ ఘన విజయం
ఆస్ట్రేలియాతో ఇండోర్‌లో ప్రారంభమైన మూడో టెస్టులో భారత జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఫామ్‌తోపాటు వైస్ కెప్టెన్సీ ట్యాగ్‌ను కూడా కోల్పోయిన టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్‌కు తుది జట్టులో చోటు లభించలేదు. అనుకున్నట్టే శుభమన్ గిల్‌కు తుది జట్టులో చోటు లభించింది. అలాగే, పేసర్ షమీకి విశ్రాంతి కల్పించి ఉమేశ్ యాదవ్‌కు జట్టులో చోటిచ్చింది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మొత్తం నాలుగు టెస్టులు జరగనుండగా తొలి రెండింటిలోనూ భారత జట్టు ఘన విజయం సాధించింది. ఈ టెస్టులోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని ఉబలాటపడుతోంది. అంతేకాదు, ఈ టెస్టులో విజయం సాధిస్తే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు భారత్ చేరుకుంటుంది.
మరోవైపు, ఘోర పరాభవ భారంతో ఉన్న ఆస్ట్రేలియా పుంజుకుని భారత్‌ను నిలువరించి పరువు కాపాడుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. మిచెల్ స్టార్క్, కామెరాన్ గ్రీన్ జట్టులోకి వచ్చారు.