వచ్చే ఎన్నికల్లో పోటీపై బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

  • మహ్మద్ ప్రవక్తపై రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు
  • గతేడాది పార్టీ నుంచి బహిష్కరణకు గురైన రాజాసింగ్
  • తనపై విధించిన సస్పెన్షన్‌ను పార్టీ ఎత్తివేస్తుందని ఆశాభావం 
  • స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోనని స్పష్టీకరణ
మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బీజేపీ నుంచి బహిష్కరణకు గురైన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ తనపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలా జరగని పక్షంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా కూడా పోటీ చేసేది లేదని తేల్చి చెప్పారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తాను పెద్ద అభిమానినన్న రాజాసింగ్.. పార్టీకి వ్యతిరేకంగా వెళ్లబోనన్నారు. బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్ సహా అందరి ఆశీస్సులు తనకు ఉన్నట్టు తెలిపారు. 

కాగా, రాజాసింగ్ గోషామహల్ నుంచి వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. గతేడాది ఆయనను పార్టీ బహిష్కరించడంతో వచ్చే ఎన్నికల్లో గోషామహల్ బీజేపీ అభ్యర్థి ఎవరన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాజాసింగ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.


More Telugu News