మహిళలు బాగుంటేనే సమాజం బాగుంటుంది: వాసిరెడ్డి పద్మ
- నాగార్జున యూనివర్సిటీలో సదస్సు
- జాతీయ మహిళా కమిషన్, రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం
- జ్యోతి ప్రజ్వలనం చేసిన వాసిరెడ్డి పద్మ
మహిళలు బాగుంటేనే కుటుంబం, పిల్లలు బాగుంటారని... తద్వారా సమాజం బాగుంటుందని ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. మహిళలు తమను తాము ప్రేమించుకోవడంతో పాటుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.
జాతీయ మహిళా కమిషన్, రాష్ట్ర మహిళా కమిషన్ సంయుక్తంగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నిర్వహించిన సదస్సుకు ముఖ్యఅతిథిగా వాసిరెడ్డి పద్మ పాల్గొన్నారు. తొలుత నాగార్జున విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని క్లినిక్ నందు మహిళలకు ఉచిత వైద్య శిబిరాన్ని వాసిరెడ్డి పద్మ ప్రారంభించారు. అనంతరం విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని ఆడిటోరియం నందు సెమినార్ ను జ్యోతి ప్రజ్వలన చేసి వాసిరెడ్డి పద్మ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... "మహిళలు తమ ఆరోగ్యంపై తామే శ్రద్ధ తీసుకోవాలి. అది మానసిక ఆరోగ్యం లేదా శారీరక ఆరోగ్యం ఏదైనా కావచ్చు. మహిళలు పంచభూతాలతో, ప్రకృతితో మమేకమై ఉంటారు. వారు మానసికంగా కూడా బలంగా ఉండాలి. భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోవడం మహిళలకు పెద్ద పరీక్ష. ఆరోగ్యం మహాభాగ్యం అనే విషయం కరోనా పరిస్థితుల తర్వాత చాలా బాగా అర్థమయింది" అంటూ వాసిరెడ్డి పద్మ ప్రసంగించారు.