సుప్రీంకోర్టులో మనీశ్ సిసోడియాకు నిరాశ
- ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయిన మనీశ్ సిసోడియా
- సుప్రీంకోర్టును ఆశ్రయించిన సిసోడియా
- నేరుగా ఇక్కడికెందుకు వచ్చారన్న సుప్రీంకోర్టు
- హైకోర్టుకు వెళ్లాలని సూచన
ఢిల్లీ లిక్కర్ స్కాంలో తనను సీబీఐ అరెస్ట్ చేయడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు నిరాశ ఎదురైంది. ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. అనేక అవకాశాలు ఉన్నప్పటికీ ఢిల్లీ హైకోర్టుకు వెళ్లకుండా నేరుగా సుప్రీంకోర్టుకు ఎందుకు వచ్చారని అభ్యంతరం తెలిపింది. ఈ కేసులో ఢిల్లీ హైకోర్టుకు వెళ్లాలని మనీశ్ సిసోడియాకు సుప్రీం ధర్మాసనం సూచించింది. అయినా, ఈ దశలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన సిసోడియా ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్నాడు. మార్చి 4తో ఆయన కస్టడీ ముగియనుంది.
లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన సిసోడియా ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్నాడు. మార్చి 4తో ఆయన కస్టడీ ముగియనుంది.