సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ అవినీతిపై విచారణ జరగాలి: వర్ల రామయ్య

  • హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్న వర్ల
  • బినామీల పేరుతో పొలాలు కొన్నారని ఆరోపణ
  • ఆ విషయం పోలీసులే చెబుతున్నారని స్పష్టీకరణ
సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ అవినీతిపై విచారణ జరగాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తెలిపారు. 

సునీల్ కుమార్ అక్రమార్జనను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని పేర్కొన్నారు. సునీల్ కుమార్ హయాంలో సీఐడీ నమోదు చేసుకుని దర్యాప్తు జరిపిన ప్రతి కేసును హైకోర్టు సిట్టింగ్ జడ్జి సమీక్షించాలని వర్ల రామయ్య కోరారు. బినామీల పేరుతో సునీల్ కుమార్ ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పొలాలు కొన్నారని పోలీసులే చెబుతున్నారని వివరించారు. 

సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ ను ఇటీవలే ఏపీ ప్రభుత్వం సీఐడీ విభాగం నుంచి బదిలీ చేసింది. కాగా, హిందుత్వాన్ని కించపరిచేలా సునీల్ కుమార్ వ్యాఖ్యలు చేశారంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు కేంద్రానికి లేఖ రాసిన నేపథ్యంలో, ఈ వ్యవహారంలో చర్యలు తీసుకోవాలంటూ కేంద్రం ఏపీ సీఎస్ కు లేఖ రాయడం తెలిసిందే. దాంతో సునీల్ కుమార్ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలంటూ సీఎస్... రాష్ట్ర డీజీపీని ఆదేశించారు.


More Telugu News