ఏపీకి మంచి జరిగే అవకాశం ఉంది: ఉండవల్లి అరుణ్ కుమార్

  • విభజన చట్టం కేసులో ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయడం శుభ పరిణామమన్న ఉండవల్లి 
  • అఫిడవిట్ వేయమని గతంలో చంద్రబాబుకు చెప్పానని వెల్లడి 
  • కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటిలో న్యాయం జరుగుతుందని వ్యాఖ్య 
ఏపీ విభజన చట్టం కేసులో సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయడం శుభ పరిణామమని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఈ అఫిడవిట్ కారణంగా ఏపీకి మంచి జరిగే అవకాశం ఉందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేకహోదా సహా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటిలో న్యాయం జరుగుతుందని అన్నారు. తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన విద్యుత్ బకాయిల అంశాన్ని కూడా ప్రభుత్వం అఫిడవిట్ లో పొందుపరిచిందని చెప్పారు. 

ఇదే విధంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేయాలని గతంలో చంద్రబాబుకు చెప్పానని... చేస్తానని చెప్పిన ఆయన చేయలేదని అన్నారు. అఫిడవిట్ లో ఉన్న అంశాలన్నింటినీ ఇచ్చి తీరాలని డిమాండ్ చేశారు. ఈ కేసు విచారణ ఏప్రిల్ 11న జరుగుతుందని చెప్పారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.  



More Telugu News