జనసేనతో కలిసి అధికారంలోకి వస్తాం: సోము వీర్రాజు
- ఏపీలో అధికారం తమదేనన్న వీర్రాజు
- రాష్ట్రంలో అభివృద్ధి తక్కువ, అప్పులు ఎక్కువని విమర్శ
- కుటుంబ రాజకీయాలను తాము ప్రోత్సహించమని వ్యాఖ్య
2024 ఎన్నికల్లో జనసేన పార్టీతో కలిసి అధికారంలోకి వస్తామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఏపీలో అధికారం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత విద్యుత్ కోతలు తగ్గాయని చెప్పారు. రోజురోజుకు ఏపీ పరిస్థితి దిగజారుతోందని అన్నారు.
ఏమాత్రం అభివృద్ధి లేదని... అప్పులు మాత్రం విపరీతంగా పెరిగిపోయాయని చెప్పారు. గతంలో టీడీపీ చేసిన మాదిరే ఇప్పుడు వైసీపీ అవినీతి రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. కుటుంబ రాజకీయాలను బీజేపీ ప్రోత్సహించదని చెప్పారు. 10వ తరగతి పాస్ కాని వాళ్లకు కూడా పట్టభద్రుల ఓట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని విమర్శించారు.