ఒక చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నారు: రకుల్ ప్రీత్ సింగ్
- బాలీవుడ్, ప్రాంతీయ సినిమాలు రెండూ ఒకటే
- వీటిని పోల్చడం సరికాదు
- ప్రేక్షకుల ఎమోషన్స్ మీద సినిమాల ఫలితం ఆధారపడి ఉంటుంది
ఇటీవలి కాలంలో రకుల్ ప్రీత్ సింగ్ పూర్తిగా బాలీవుడ్ పై ఫోకస్ చేసిన విషయం తెలిసిందే. గత ఏడాది ఆమె బాలీవుడ్ లో ఐదు సినిమాలు చేసింది. ఇప్పుడు కూడా ఆమెకు అక్కడ ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. మరోవైపు కరోనా తర్వాత బాలీవుడ్ కు టాలీవుడ్ పెద్ద పోటీని ఇస్తోంది. మన సినిమాల ముందు హిందీ సినిమాలు వెలవెలపోతున్నాయి. ఓటీటీలో సైతం తెలుగు సినిమాల హవా నడుస్తోంది.
ఈ అంశంపై రకుల్ మాట్లాడుతూ... సోషల్ మీడియాలో ప్రతి చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నారని విమర్శించింది. హిందీ సినిమాలు, ప్రాంతీయ సినిమాలు రెండూ ఒకటేనని... వాటిని ఒకదానితో మరొకదాన్ని పోల్చడం సరికాదని వ్యాఖ్యానించింది. అన్నిటికన్నా ప్రేక్షకులే ముఖ్యమని... మంచి సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారని తెలిపింది. మన దేశంలో గొప్ప ఆలోచనలు ఉన్న దర్శకులు చాలా మంది ఉన్నారని... వారు మన దేశ సినీ పరిశ్రమకు మంచి పేరు తెచ్చే సినిమాలను రూపొందించగలరని చెప్పారు.
ఇటీవలి కాలంలో ఓటీటీలకు ఆదరణ బాగా పెరిగిందని చెప్పింది. సినిమా బాగుంటే థియేటర్ లో, ఓటీటీలో కూడా చూస్తారని తెలిపింది. ప్రేక్షకుల ఎమోషన్స్ మీదే సినిమాల ఫలితం ఆధారపడి ఉంటుందని చెప్పింది.