ప్రీతి మృతిని కొందరు అనవసరంగా రాజకీయం చేస్తున్నారు: కేటీఆర్
- వైద్య విద్యార్థిని ప్రీతి కన్నుమూత
- ఇటీవల ఆత్మహత్యకు యత్నించిన ప్రీతి
- ర్యాగింగ్ వల్ల ప్రీతి మృతి చెందడం బాధాకరమన్న కేటీఆర్
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి వైద్య కళాశాలలో వేధింపులకు ప్రీతి అనే వైద్య విద్యార్థిని బలి కావడం పట్ల మంత్రి కేటీఆర్ స్పందించారు. కాలేజీలో జరిగిన ర్యాగింగ్ వల్ల డాక్టర్ ప్రీతి మరణించడం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు. కానీ ప్రీతి మృతి అంశాన్ని కొందరు అనవసరంగా రాజకీయం చేస్తున్నారని కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రీతి మృతికి కారకులైన నిందితులు సైఫ్ అయినా, సంజయ్ అయినా వదిలేది లేదని హెచ్చరించారు. నిందితులు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
ప్రీతి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన కేటీఆర్... ప్రభుత్వం తరఫున, పార్టీ పరంగా ఆమె కుటుంబానికి అండగా నిలుస్తామని తెలిపారు. కాగా, మెడికో ప్రీతి అంత్యక్రియలు ఆమె స్వగ్రామం జనగామ జిల్లాలోని గిర్నితండాలో ముగిశాయి.
కిషన్ రెడ్డికి మెదడు మోకాళ్లలో ఉందా? అరికాళ్లలో ఉందా?: కేటీఆర్
తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై ధ్వజమెత్తారు. ఈడీ, సీబీఐకి భయపడేది లేదని స్పష్టం చేశారు. కిషన్ రెడ్డికి మెదడు మోకాళ్లలో ఉందా, లేక అరికాళ్లలో ఉందా? అని విమర్శించారు.
"మోదీ ఎంతో శ్రమపడి కరోనా వ్యాక్సిన్ కనిపెట్టాడని ఒకాయన అంటున్నారు... మరి శాస్త్రవేత్తలంతా గడ్డి కోశారా? ఇలాంటి వ్యాఖ్యలు చేసే కిషన్ రెడ్డిని ఏమనాలి?" అని కేటీఆర్ మండిపడ్డారు.
ఇదే సందర్భంగా బండి సంజయ్ పైనా కేటీఆర్ ధ్వజమెత్తారు. "మోదీ ఎవరికి దేవుడు? ఎందుకు దేవుడు? తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్నాడు. ఆయన అదానికీ దేవుడు కావొచ్చు... మాకు కాదు... తెలంగాణకు పట్టిన పెద్ద శని, దరిద్రం బీజేపీనే" అని మండిపడ్డారు.