'నేను స్టూడెంట్ సర్' రిలీజ్ డేట్ వాయిదా!

'నేను స్టూడెంట్ సర్' రిలీజ్ డేట్ వాయిదా!
  • బెల్లంకొండ గణేశ్ హీరోగా 'నేను స్టూడెంట్ సర్'
  • కథానాయికగా అవంతిక పరిచయం 
  • సంగీతాన్ని అందించిన మహతి స్వరసాగర్ 
  • మార్చి 10వ తేదీ నుంచి వాయిదా పడిన సినిమా

బెల్లంకొండ గణేశ్ నుంచి రెండవ సినిమాగా 'నేను స్టూడెంట్ సర్' రూపొందింది. సతీశ్ వర్మ నిర్మించిన ఈ సినిమాకి, రాఖి ఉప్పలపాటి దర్శకత్వం వహించాడు. ఒక కాలేజ్ స్టూడెంట్ కి ఎదురైన ఒక సమస్య నుంచి ఎలా బయటపడ్డాడు అనే కథాంశంతో ఈ సినిమా నిర్మితమైంది. 

ఈ సినిమాను మార్చి 10వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు వాయిదా వేశారు. ఎగ్జామ్స్ కారణంగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు. కొత్త రిలీజ్ డేట్ ను పరీక్షల తరువాత ప్రకటించనున్నారు. 

ఈ సినిమాతో భాగ్యశ్రీ కూతురు 'అవంతిక' కథానాయికగా పరిచయం కానుంది. ఈ సినిమా కోసం మహతి స్వరసాగర్ స్వరపరిచిన పాటలు ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనున్నాయి. సముద్రఖని .. సునీల్ .. శ్రీకాంత్ అయ్యంగార్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.


More Telugu News