ఇండియాకు చేరుకున్న ఇజ్రాయెల్ లో మిస్ అయిన రైతు
- అత్యాధునిక వ్యవసాయ పద్ధతులను అధ్యయనం చేసేందుకు వెళ్లిన టీమ్
- టూర్ తర్వాత కనిపించకుండా పోయిన కురియన్
- జెరూసలేం, బెత్లెహాంలను చూసేందుకు వెళ్లానని వెల్లడి
అత్యాధునిక వ్యవసాయ పద్ధతులపై అధ్యయనం చేసేందుకు ఇజ్రాయెల్ కు వెళ్లిన కేరళ రైతు అక్కడ మిస్ అయిన సంగతి తెలిసిందే. ఆయన ఈ ఉదయం కేరళలోని కాలికట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యారు. దీంతో, అంతా ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళ్తే ఇజ్రాయెల్ లో చేపడుతున్న అత్యాధునిక వ్యవసాయ పద్ధతులను అధ్యయనం చేసేందుకు కేరళ నుంచి 27 మందితో కూడిన ఒక బృందం ఆ దేశానికి వెళ్లింది. ఐదు రోజుల టూర్ కు గాను వాళ్లు వెళ్లారు. వీరిలో 48 ఏళ్ల బిజూ కురియన్ అనే రైతు కూడా ఉన్నారు.
ఇజ్రాయెల్ కు వెళ్లిన తర్వాత అందరితో కలిసి స్టడీ టూర్ ను ఆయన కూడా పూర్తి చేశాడు. స్టడీ పూర్తయిన తర్వాత ఫిబ్రవరి 17 నుంచి ఆయన కనిపించలేదు. దీంతో అందరూ ఎంతో ఆందోళన చెందారు. కురియన్ లేకుండానే బృందంలోని ఇతర సభ్యులు ఇండియాకు తిరిగొచ్చేశారు.
ఈ ఉదయం కాలికట్ ఎయిర్ పోర్టులో కురియన్ ల్యాండ్ అయ్యాడు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ... జెరూసలేం, బెత్లెహాం చూసేందుకు వెళ్లానని చెప్పాడు. తాను సేఫ్ గానే ఉన్నానని కుటుంబసభ్యులతో చెప్పానని.. తన ఫోన్ లో ఇంటర్నెట్ కానీ, ఇంటర్నేషనల్ కాలింగ్ ఫెసిలిటీ కానీ లేదని తెలిపారు. తన సోదరుడి సాయంతో తాను తిరిగి ఇండియాకు చేరుకున్నానని చెప్పాడు. తన వీసా మే 8 వరకు చెల్లుతుందని... అందువల్ల తాను అక్కడ ఉండటం ఇల్లీగల్ కాదని తెలిపాడు. మరోవైపు దీనిపై కేరళ వ్యవసాయ మంత్రి పి.ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వానికి కురియన్ క్షమాపణ చెప్పాడని తెలిపారు.