కేరక్టర్ ఆర్టిస్టుల ఆర్ధిక ఇబ్బందులకు కారణం ఏమిటంటే.. !: నాగినీడు
- కేరక్టర్ ఆర్టిస్టుగా నాగినీడు బిజీ
- ఆర్ధికపరమైన భద్రత గురించిన ప్రస్తావన
- బలహీనతలే దెబ్బతీస్తాయని వ్యాఖ్య
- తనకి కాస్త కోపం ఎక్కువని వెల్లడి
నాగినీడు సింపుల్ గా కనిపిస్తూనే పవర్ఫుల్ విలనిజాన్ని పలికించగల నటుడు. చురుకైన చూపులు .. వాయిస్ ఆయన ప్రత్యేకతలుగా కనిపిస్తాయి. కేరక్టర్ ఆర్టిస్టుగా ఆయన ఇప్పుడు బిజీ. తాజా ఇంటర్వ్యూలో నాగినీడు మాట్లాడుతూ .. "కేరక్టర్ ఆర్టిస్టులుగా చాలా సినిమాలు చేసినవారు, కొంతకాలం పాటు సినిమాలు లేకపోయినా ఆర్ధికంగా ఇబ్బందులు పడుతుంటారు" అని అన్నారు.
"అలా వారు ఇబ్బందులు పడటానికి కారణాలు ఉన్నాయి. అవకాశాలు ఉన్నప్పుడు కొంతమంది విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. అవకాశాలు లేవప్పుడు కూడా అదే లైఫ్ స్టైల్ ను కొనసాగించాలని చూస్తారు. అందులో భాగంగానే కొన్ని రకాల వ్యసనాలకు అలవాటు పడటం జరుగుతూ ఉంటుంది. దాంతో ఆర్ధికంగా మరిన్ని కష్టాలు మొదలవుతాయి" అని చెప్పారు.
"అంతేకాదు చుట్టూ ఉన్న కోటరీ గురించి కూడా ఆలోచన చేయవలసి ఉంటుంది. కేరక్టర్ ఆర్టిస్టుగా చేసినవారిలో కొంతమంది సినిమాలు నిర్మించారు. అందువలన దెబ్బతిన్నవారే ఎక్కువ. ఇక సహజంగానే నాకు చాలా కోపం ఎక్కువ. అయితే నా కోపం వలన ఇంతవరకూ ఎలాంటి అనర్థాలు జరగలేదు" అంటూ చెప్పుకొచ్చారు.