మూడు రాజధానులపై విచారణ తేదీని ప్రకటించిన సుప్రీంకోర్టు

  • అమరావతే రాజధాని అంటూ హైకోర్టు తీర్పు
  • హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన వైసీపీ ప్రభుత్వం
  • మార్చి 28న విచారిస్తామన్న సుప్రీంకోర్టు
ఏపీలో మూడు రాజధానుల అంశం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అమరావతే రాష్ట్ర రాజధాని అని ఏపీ హైకోర్టు తీర్పును వెలువరించిన సంగతి కూడా విదితమే. హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ తరుణంలో సుప్రీంకోర్టు విచారణ తేదీని ఖరారు చేస్తూ ఈరోజు కీలక ప్రకటన చేసింది. 

మార్చి 28న ఈ కేసును విచారిస్తామని తెలిపింది. కేసును త్వరగా విచారించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. వారి విన్నపం మేరకు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ కేఎం జోసెఫ్ లతో కూడిన ధర్మాసనం తేదీని ఖరారు చేసింది.


More Telugu News