అమ్మాయిల వంక చూస్తే గుడ్లు పీకేస్తానన్నాడు.. ఇప్పటి వరకు గడీ దాటింది లేదు: షర్మిల
- ప్రీతి మృతి అత్యంత విషాదకరమన్న షర్మిల
- ప్రిన్సిపాల్ స్పందించి ఉంటే ప్రీతి ప్రాణాలు దక్కేవని వ్యాఖ్య
- కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే అఘయిత్యాలు జరుగుతున్నాయని మండిపాటు
మెడికో విద్యార్థిని ప్రీతి మృతి అత్యంత విషాదకరమని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. వేధింపులు, ర్యాగింగ్ భూతానికి ఒక విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం కలచివేసిందని చెప్పారు. మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ గతంలోనే స్పందించి ఉంటే ప్రీతి ప్రాణాలు దక్కేవని అన్నారు. రాష్ట్రంలో అమ్మాయిలకు రక్షణ కల్పించడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని చెప్పారు.
అమ్మాయిల వంక చూస్తే గుడ్లు పీకేస్తానని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారని... ఇంతవరకు గడీ దాటింది లేదని షర్మిల విమర్శించారు. ముఖ్యమంత్రి నిర్లక్ష్యం వల్లే అల్లరిమూకలు రెచ్చిపోయి అఘాయిత్యాలకు పాల్పడుతున్నాయని అన్నారు. ప్రీతిని వేధించిన వ్యక్తితో పాటు, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్రంలోని అమ్మాయిలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.