సిసోడియా మాదిరే కవిత కూడా అరెస్ట్ అవుతుంది.. ఆప్ కు కవిత 150 కోట్లు ఇచ్చింది: వివేక్ వెంకటస్వామి
- తెలంగాణ మాదిరే ఢిల్లీ, పంజాబ్ లో లిక్కర్ స్కామ్ చేసేందుకు యత్నించారన్న వివేక్
- దోచుకున్న అవినీతి సొమ్మును ఇతర రాష్ట్రాల్లో ఖర్చు చేస్తున్నారని ఆరోపణ
- తెలంగాణలో బీఆర్ఎస్ ఖతమవుతుందని జోస్యం
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ కావడం ఖాయమని బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా మాదిరే కవిత కూడా అరెస్ట్ అవుతారని చెప్పారు. ఆప్ పార్టీకి ఎన్నికల కోసం కవిత రూ. 150 కోట్లు ఇచ్చారని సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణలో మాదిరే లిక్కర్ స్కామ్ ను ఢిల్లీలో, పంజాబ్ లో అమలు చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.
తెలంగాణ ఖజానాను కేసీఆర్ దోచుకున్నారని వివేక్ అన్నారు. రాష్ట్రంలో దోచుకున్న అవినీతి సొమ్మును ఇతర రాష్ట్రాల్లో ఖర్చు పెడుతున్నారని... దోపిడీ చేసిన డబ్బుతో దేశమంతా తిరుగుతున్నారని దుయ్యబట్టారు. లిక్కర్ స్కామ్ లో చాలా మంది అరెస్ట్ అవుతారని జోస్యం చెప్పారు. కేసీఆర్ పై తెలంగాణ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని... దీన్నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికే బీఆర్ఎస్ ను తెరపైకి తీసుకొచ్చారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో కూడా ఖతమవుతుందని చెప్పారు. ఔట్ డేటెడ్ నాయకులే బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఎద్దేవా చేశారు. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని ఈరోజు వివేక్ దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు.