ఐపీఎల్ నుంచి బుమ్రా ఔట్!
- ఐపీఎల్‌కు బుమ్రా అందుబాటులో ఉంటాడన్న వార్తలను ఖండించిన బీసీసీఐ
- ముంబై ఇండియన్స్ ఆశలపై నీళ్లు
- పూర్తి ఫిట్‌నెస్ కోసం శతథా ప్రయత్నిస్తున్న బుమ్రా
భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ముంబై ఇండియన్స్‌కు ఐపీఎల్ నాటికి అందుబాటులో ఉండే అవకాశం దాదాపు లేనట్టే. గాయం కారణంగా గత ఆరు నెలలుగా క్రికెట్‌కు దూరమైన బుమ్రా ఐపీఎల్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నారన్న వార్తలను బీసీసీఐ, ఐపీఎల్ వర్గాలు తాజాగా కొట్టి పారేశాయి. వైద్యుల మునపటి అంచనా కంటే బుమ్రా గాయం తీవ్రమైనదని, అతడు కోలుకునేందుకు మరింత సమయం పడుతుందని సూచన ప్రాయంగా చెప్పాయి. దీంతో..జూన్‌లో జరగబోయే డబ్ల్యూటీసీ ఫైనల్‌తో పాటూ ఐపీఎల్-2023కి కూడా బుమ్రా అందుబాటులో ఉండడని స్పష్టం చేసినట్టైంది.
ప్రస్తుతం బుమ్రా ఎన్‌సీఏలోని రిహాబిలిటేషన్‌లో ఉన్నాడు. గాయం నుంచి కోలుకుని పూర్తి ఫిట్‌నెస్ సాధించేందుకు విశప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఆస్ట్రేలియాతో ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా తలపడుతోంది. సిరీస్‌లో భాగంగా జరిగిన రెండు మ్యాచుల్లో భారత్ విజయం సాధించింది. మూడో టెస్ట్ మార్చి 1న జరగనుంది. టెస్ట్ సిరీస్ అనంతరం ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ జరుగుతుంది. తొలి వన్డే సిరీస్‌కు బుుమ్రా అందుబాటులోకి వస్తాడని అంతా భావించారు. అయితే..అతడు మరికొంత కాలం క్రికెట్‌కు దూరంగా ఉండక తప్పదని తాజాగా తేలింది.