నా ఒరిజినల్ క్యారెక్టర్ నే రాజమౌళి నాకు ఇచ్చారు: నటుడు నాగినీడు

  • క్యారెక్టర్ ఆర్టిస్టుగా నాగినీడు బిజీ 
  • 'మర్యాద రామన్న'తో మంచి గుర్తింపు 
  • తన ప్రతిభను రాజమౌళి బయటికి తీశారని వ్యాఖ్య 
  • వేషాలు రావనే భయం లేదని వెల్లడి  

నాగినీడు అనే పేరు వినగానే అందరి కళ్లముందు కదలాడేది 'మర్యాద రామన్న' సినిమాలో ఆయన పోషించిన రామినీడు పాత్ర. 'మీరు ఇంత మర్యాద ఇస్తే నేను ఎంతో మర్యాదనిస్తా .. తేడా వస్తే' అంటూ ఆ సినిమాలో రాయలసీమ యాసలో ఆయన చెప్పిన డైలాగ్ అందరికీ బాగా గుర్తు.

తాజాగా 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' కార్యక్రమంలో నాగినీడు మాట్లాడుతూ .. "తమిళంలో నేను చేసిన 'పళ్లి కూడుమ్' సినిమాను రాజమౌళి చూశారాట. ఆ సినిమాలో నేను పోషించిన పాత్ర .. నా నటన ఆయనకి బాగా నచ్చాయి. అందువల్లనే ఆయన నన్ను పిలిపించి 'మర్యాద రామన్న' సినిమాలో 'రామినీడు' పాత్రను ఇచ్చారు. 

ఈ సినిమాలో నేను చాలా బాగా చేశానని అంతా అంటున్నారు. నిజానికి నా ఒరిజినల్ క్యారెక్టర్ అదే .. మాది రాయలసీమనే. ఇంత మర్యాద ఇస్తే .. ఇంత మర్యాదనిస్తాను .. తేడా వస్తే కూడా అలాగే ఉంటుంది. ఆ ఒరిజినాలిటీని రాజమౌళి గారు బయటికి తీశారు. ఏ విషయంలోనైనా నేను ముక్కుసూటిగానే ఉంటాను. నాకు వేషాలు ఇవ్వరేమో .. రావేమో అనే భయం నాకు ఎప్పుడూ లేదు" అని చెప్పారు.


More Telugu News