గుడ్ న్యూస్.. బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం
- ఈ నెలలో రూ. 2 వేల వరకు తగ్గిన బంగారం ధర
- ఆనందంలో మధ్య తరగతి ప్రజలు
- తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ. 51,500
ఇటీవలి కాలంలో బంగారం ధర ముందు రోజుతో పోలిస్తే స్థిరంగా ఉండటమో లేదా కాస్త తగ్గడమో జరుగుతోంది. ఈ నెలలో ఇప్పటికే రూ. 2 వేల వరకు తగ్గింది. దీంతో మధ్య తరగతి ప్రజల్లో ఆనందం నెలకొంది. రాబోయే రోజుల్లో మళ్లీ ధరలు పెరుగుతాయేమో అనే ఆలోచనతో ఇప్పుడు బంగారం కొనేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు.
హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,180గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 51,500 గా ఉంది. విశాఖ, విజయవాడలో కూడా ఇదే ధర ఉంది. కిలో వెండి ధర రూ. 70 వేలుగా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలలో కిలో వెండి ధర రూ. 67,500గా ఉంది.