మహేశ్ బాబు-త్రివిక్రమ్ చిత్రం తాజా షెడ్యూల్ రేపటి నుంచి!

మహేశ్ బాబు-త్రివిక్రమ్ చిత్రం తాజా షెడ్యూల్ రేపటి నుంచి!
  • మహేశ్ బాబు-త్రివిక్రమ్ కలకయిలో హ్యాట్రిక్ చిత్రం
  • మహేశ్ బాబు కెరీర్ లో ఇది 28వ సినిమా
  • ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి
  • షూటింగ్ లో పాల్గొననున్న శ్రీలీల
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో కొత్త చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. మహేశ్ బాబుకు ఇది 28వ చిత్రం కాగా, త్రివిక్రమ్ తో మూడోది. గతంలో వీరిద్దరి కలయికలో అతడు, ఖలేజా చిత్రాలు వచ్చాయి. కాగా, ఇప్పుడు హ్యాట్రిక్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

ఈ సినిమాకు ఎస్ఎస్ఎంబీ 28 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఇప్పటికే ఈ సినిమా ఒక షెడ్యూల్ పూర్తిచేసుకుంది. రేపటి నుంచి రెండో షెడ్యూల్ జరగనుంది. ఈ చిత్రంలో మహేశ్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తోంది. 

అయితే, ఇందులో యువ అందాలభామ శ్రీలీల కూడా కీలకపాత్ర పోషిస్తోంది. రేపటినుంచి జరిగే షూటింగ్ లో శ్రీలీల కూడా పాల్గొననుంది. ఇటీవలే మహేశ్ బాబు ఫారెన్ ట్రిప్ కంప్లీట్ చేసుకుని రావడంతో ఈ చిత్రం తాజా షెడ్యూల్ కు రూపకల్పన చేశారు.


More Telugu News