ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె’లో కీలక మార్పు
- సంగీత దర్శకుడిని మార్చిన చిత్ర బృందం
- మిక్కీ జే మేయర్ స్థానంలో సంతోష్ నారాయణ్ రాక
- చివరి దశకు చేరుకున్న షూటింగ్?
‘రాధేశ్యామ్’తర్వాత ప్రభాస్ తెరపై కనిపించి చాన్నాళ్లు అవుతోంది. ఆ ఫెయిల్యూర్ తర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ భారీ సైన్స్ ఫిక్షన్ సినిమాలో నటిస్తున్నాడు. మూవీ. ‘ప్రాజెక్ట్ కె’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఈనెలాఖరులో చివరి షెడ్యూల్ ను మొదలవనుంది. ఓవైపు షూటింగ్ తో పాటు గ్రాఫిక్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. చిత్రీకరణ చివరి దశలో ఉన్న సమయంలో ఈ చిత్రంలో అనూహ్య మార్పు చోటు చేసుకుంది.
ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా మిక్కీ జే మేయర్ పేరును చిత్రబృందం గతంలో ప్రకటించింది. కానీ, ఇప్పుడు మిక్కీ స్థానంలో సంతోష్ నారాయణ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇక, ఈ చిత్రం టైటిల్‌ను వచ్చే నెలలో ప్రకటించే అవకాశం ఉంది. ఈ పాన్ ఇండియా చిత్రంలో ప్రభాస్ సరసన దీపికా పదుకుణే హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర చేస్తున్నారు. అశ్వనీదత్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నారు.