నాటు నాటుకు దక్షిణ కొరియా ఎంబసీ సిబ్బంది స్టెప్పులు.. స్పందించిన మోదీ
- ప్రపంచాన్ని ఊపేస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలోని పాట
- పాటకు కాలు కదిపిన భారత్ లోని దక్షిణా కొరియా దౌత్య కార్యాలయ సిబ్బంది
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు ప్రపంచాన్ని ఊపేస్తోంది. ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన ఈ పాటకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది కాలు కదుపుతున్నారు. తాజాగా ఇప్పుడు భారత్‌లోని దక్షిణ కొరియా రాయబార కార్యాలయానికి కూడా ఫీవర్ పట్టుకుంది. దక్షిణ కొరియా రాయబార కార్యాలయ సిబ్బంది నాటు నాటు పాటకు తమదైన శైలిలో స్టెప్పులు వేశారు. ఈ వీడియోను ఎంబసీ తమ అధికారిక ట్విట్టర్‌లో షేర్ చేయగా.. అది వైరల్ అవుతోంది.
53 సెకన్ల నిడివిగల క్లిప్‌లో దక్షిణ కొరియా రాయబార కార్యాలయ సిబ్బంది నాటు నాటుకు చాలా ఉత్సాహంతో నృత్యం చేశారు. వారితో దక్షిణ కొరియా రాయబారి చాంగ్ జే-బోక్ కూడా చేరారు. టీమ్ మొత్తం పాటలోని హుక్ స్టెప్ కూడా వేసింది. ఆన్‌లైన్‌లో షేర్ చేసిన కొద్దిసేపటికే ఈ వీడియోకు 2 లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి. ఈ క్లిప్ భారత ప్రధాని మోదీ దృష్టిని కూడా ఆకర్షించింది. దీనిపై స్పందించిన ఆయన జట్టు ప్రయత్నాన్ని ప్రశంసించారు.