పుట్టుకతో వచ్చిన వ్యాధి ముదరడంతో యువతి ఆత్మహత్య
- పుట్టుకతోనే యువతికి థైరాయిడ్
- ఇటీవల వ్యాధి ముదరడంతో మనస్తాపం చెందిన యువతి
- తల్లిదండ్రులకు భారం కాకూడదని యువతి బలవన్మరణం
ఆ యువతికి పుట్టుకతోనే థైరాయిడ్ వ్యాధి. ఇటీవల సమస్య మరింతగా ముదిరింది. వైద్యుల చికిత్సలేవీ ఆశించిన ఫలితం ఇవ్వడం లేదు. దీంతో.. తల్లిదండ్రులకు భారం కావద్దని భావించిన యువతి చివరకు బలవన్మరణానికి పాల్పడింది. జీడిమెట్ల ఎస్సై మన్మధరావు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనివాసరావు అనే వ్యక్తి కుటుంబంతో కలిసి సంజయ్‌గాంధీ నగర్‌లో నివాసముంటున్నారు.
తొలుత శ్రీనివాసరావు దంపతులకు ఓ కుమార్తె జన్మించగా.. ఆ మరుసటి కాన్పులో ముగ్గురు కవలలు పుట్టారు. వీరిలో దివ్యకు(21)పుట్టుకతోనే థైరాయిడ్ వ్యాధి ఉంది. ప్రస్తుతం ఆమె డిగ్రీ చదువుతోంది. ఇటీవల కాలంలో వ్యాధి ముదరడంతో దివ్య మానసికంగా కుంగిపోయింది. ఈ క్రమంలో ఆమె శనివారం ఉదయం ఇంటి వెనుక ఉరి వేసుకున్న విషయాన్ని కుటుంబీకులు గమనించారు. వెంటనే ఆమెను పరిశీలించగా అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్టు తెలుసుకుని గొల్లుమన్నారు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.