రామ్ చరణ్ మరిన్ని మంచి చిత్రాలు చేసి ఘన విజయాలు సాధించాలి: పవన్ కల్యాణ్
- ఆర్ఆర్ఆర్ సినిమాకు అవార్డులు దక్కడం ఆనందంగా ఉందన్న పవన్
- చరణ్, రాజమౌళి, చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసిన జనసేనాని
- హెచ్‌సీఏ ఫిల్మ్ అవార్డుల్లో ‘ఆర్ఆర్ఆర్’కి నాలుగు అవార్డులు
హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో ‘ఆర్ఆర్ఆర్’కి పురస్కారాలు దక్కడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు అవార్డులు దక్కడం ఆనందంగా ఉందని అన్నారు. అదే వేదికపై నుంచి ‘బెస్ట్ వాయిస్, మోషన్ కాప్చర్ పెర్ఫార్మెన్స్’ అవార్డుల ప్రకటనను రామ్ చరణ్‌తో చేయించడం, స్పాట్ లైట్ అవార్డు స్వీకరించడం తనకు సంతోషాన్ని కలిగించిందని అన్నారు. రామ్ చరణ్, దర్శకుడు రాజమౌళికి, చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నట్టు చెప్పారు. అలాగే, చరణ్ మరిన్ని మంచి సినిమాలు చేసి ఘన విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు పవన్ పేర్కొన్నారు.
శుక్రవారం రాత్రి అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో నిర్వహించిన హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఫిల్మ్ అవార్డులలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నాలుగు అవార్డులు దక్కించుకుంది. ఈ వేడుకలో రామ్ చరణ్ వ్యాఖ్యాతగా వ్యవహరించి ఉత్తమ వాయిస్, మోషన్ క్యాప్చర్ పెర్ఫార్మెన్స్ విభాగంలో విజేతలను ప్రకటించడం విశేషం. కాగా, ఉత్తమ అంతర్జాతీయ చిత్రం అవార్డును చరణ్, రాజమౌళి కలిసి సంయుక్తంగా అందుకున్నారు. అలాగే, ఉత్తమ స్టంట్స్, ఉత్తమ ఒరిజినల్ సాంగ్ (నాటు నాటు) విభాగాల్లోనూ పురస్కారాలు దక్కించుకుంది. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ అవార్డును సంగీత దర్శకుడు కీరవాణి అందుకున్నారు. ఉత్తమ యాక్షన్ చిత్రం, ఉత్తమ స్టంట్స్ అవార్డులను రాజమౌళి అందుకున్నారు.