గృహహింస చట్టాలను సవరించడం లేదని ఆగ్రహం.. భార్యాబాధితుల సంఘం సభ్యుల నిరాహార దీక్ష

  • గృహ హింస చట్టాలను సవరించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన
  • చట్టంలోని లొసుగులను అడ్డంపెట్టుకుని భర్త కుటుంబ సభ్యులను కూడా వేధిస్తున్నారని ఆరోపణ
  • నేటి సాయంత్రం వరకు కొనసాగనున్న దీక్ష
భార్యాబాధితుల సంఘం సభ్యులు నిన్న బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. గృహ హింస చట్టాలను సవరించాలని డిమాండ్ చేస్తూ వస్తున్న వారు మరోమారు అదే డిమాండ్‌తో ‘సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్’తో కలిసి నిరాహార దీక్షకు దిగారు. చట్టాలను సవరించకపోవడంతో తాము ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

నేటి(ఆదివారం) సాయంత్రం వరకు దీక్షను కొనసాగించనున్నట్టు సంఘ సభ్యుడు రాఘవేంద్ర తెలిపారు. గృహ హింస చట్టంలోని లొసుగులను అడ్డం పెట్టుకుని భర్తలను వేధించడం పనిగా పెట్టుకుంటున్నారని, విదేశాల్లో ఉంటున్న భర్త తరపు కుటుంబ సభ్యులను కూడా వేధిస్తున్నారని సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ఆర్ఐ కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.


More Telugu News