‘పులి-మేక’ వంటి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ను అందించిన జీ 5కి థాంక్స్: లావణ్య త్రిపాఠి!

  • జీ 5 నుంచి వచ్చిన 'పులి - మేక'
  • థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ 
  • తనకి మంచి డెబ్యూ పడిందన్న ఆది 
  • డిఫరెంట్ రోల్ పడటం పట్ల లావణ్య త్రిపాఠి హర్షం
  • ఈ తరహా కాన్సెప్టులు రావాలన్న సుస్మిత  

ఇండియాలోనే వ‌న్ ఆఫ్ ది బెస్ట్ ఓటీటీల్లో ఒక‌టైన జీ 5 త‌మ ఆడియెన్స్ కోసం తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ, మ‌రాఠీ, గుజ‌రాతీ, బెంగాలీ స‌హా ఇత‌ర భాష‌ల్లో వైవిధ్య‌మైన కంటెంట్‌ను అందిస్తోంది. ఈ ఓటీటీ లైబ్ర‌రీలో ఫిబ్ర‌వ‌రి 24న‌ మ‌రో బెస్ట్ ఒరిజిన‌ల్‌గా ‘పులి మేక’ యాడ్ అయ్యింది. ఈ ఒరిజిన‌ల్‌ను జీ 5, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌ కలిసి రూపొందించాయి. లావ‌ణ్య త్రిపాఠి, ఆది సాయికుమార్‌ జంటగా నటించిన ఈ సిరీస్‌లో  సిరి .. రాజా .. సుమన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. 

ఫిబ్రవరి 24 నుంచి ఈ సిరీస్ జీ 5లో స్ట్రీమింగ్ అవుతూ సూపర్బ్ రెస్పాన్స్‌ని రాబట్టుకుంటోంది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆది సాయికుమార్ మాట్లాడుతూ .. 'పులి - మేక' విషయంలో ముందుగా కోనగారికి థాంక్స్ చెబుతున్నాను. త‌ర్వాత జీ 5 వారికి థాంక్స్‌. 'పులి - మేక' స్క్రిప్ట్ ..  క్యారెక్ట‌రైజేష‌న్ బాగా నచ్చాయి. చ‌క్రిగారు చ‌క్క‌గా డైరెక్ట్ చేశారు. ఓటీటీ పరంగా మంచి డెబ్యూలాగా ఫీల్ అవుతున్నాను. మా అమ్మ‌గారు స‌హా యు.ఎస్‌లో నా రిలేటివ్స్ చూసి ఫోన్ చేసి అప్రిషియేట్ చేశారు ’’ అన్నారు. లావ‌ణ్య త్రిపాఠి మాట్లాడుతూ ‘‘ఇంత మంచి ప్రాజెక్ట్‌ను తీసుకొచ్చిన కోన వెంక‌ట్‌గారికి, దాన్ని ఇంకా అద్బుతంగా డైరెక్ట్ చేసిన చ‌క్రిగారికి థాంక్స్‌. ఇంకా మా ఈవెంట్‌కు వ‌చ్చి స‌పోర్ట్ చేసిన గెస్టులంద‌రికీ స్పెష‌ల్ థాంక్స్‌. ఆది సాయికుమార్‌గారు చాలా సెటిల్డ్‌గా న‌టించారు" అన్నారు. కోన వెంక‌ట్ మాట్లాడుతూ ‘‘నేను ఫస్ట్ టైమ్ రైటర్‌గా వర్క్ చేసిన అంద‌రికీ బ్లాక్ బ‌స్ట‌ర్స్ వ‌చ్చాయి. అదే సెంటిమెంట్ ఆది విష‌యంలోనూ నిజ‌మైంది. 'పులి - మేక' సిరీస్ పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది. యు.ఎస్‌, యు.కె. జ‌ర్మ‌నీ ఇలా అన్నీ చోట్ల నుంచి మంచి ఫీడ్ బ్యాక్ వ‌స్తుంది. ప్ర‌తీ ఒక్క‌రూ ప్రాణం పెట్టి వ‌ర్క్ చేశారు. అంద‌రికీ థాంక్స్‌’’ అన్నారు. సుష్మిత కొణిదెల మాట్లాడుతూ .. ‘క్యూట్‌ గా .. స్వీట్‌గా ఉండే లావ‌ణ్య త్రిపాఠిని ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ రోల్‌కి ఎంపిక చేసిన కోన వెంక‌ట్‌గారిని ఈ సంద‌ర్భంగా అభినందిస్తున్నాను. లావ‌ణ్య అద్భుతంగా చేసింది. కోన‌గారి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఆయ‌న బ్రిలియంట్ స్టోరి టెల్ల‌ర్‌. ఆయ‌న షో రన్న‌ర్‌గా చేసిన ఇలాంటి వెబ్ సిరీస్ ఎంగేజింగ్‌గానే ఉటుంద‌న‌టంలో సందేహం లేదు. ఇలాంటి వెరైటీ కాన్సెప్ట్‌ల‌ను ఓటీటీల్లో రావ‌టం మంచి పరిణామం" అన్నారు. 
డైరెక్ట‌ర్ శివ నిర్వాణ మాట్లాడుతూ ‘‘కోన వెంకట్‌గారు నాకు గాడ్ ఫాద‌ర్‌. ఇంత మంది న‌టీన‌టుల‌ను ఒక వేదిక‌పై తీసుకు రావ‌టం ఆయనకే సాధ్యం. లావ‌ణ్య త్రిపాఠిగారు, ఆది సాయికుమార్‌గారు పాత్ర‌లు చాలా గ్రిప్పింగ్‌గా ఉన్నాయి. లావ‌ణ్య‌గారు ఫైట్స్ చేయ‌టం చూస్తే షాకింగ్‌గా అనిపించింది. డైరెక్ట‌ర్ చ‌క్రి నాకు క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్‌గా తెలుసు. ఇలాంటి థ్రిల్ల‌ర్‌ను ఎలా చేస్తాడోన‌ని అనుకున్నాను. కానీ త‌ను ఏదైనా చేయ‌గ‌ల‌నని ప్రూవ్ చేశాడు. న‌టీన‌టుల‌కు ..  సాంకేతిక నిపుణుల‌కు థాంక్స్‌’’ అన్నారు.



More Telugu News