త్వరలో అఖిలపక్షంతో రాష్ట్రపతి వద్దకు వెళ్లాలని షర్మిల నిర్ణయం

  • నేడు రాజ్ భవన్ కు వెళ్లిన షర్మిల
  • రాష్ట్రపతి పాలన విధించాలని వినతి
  • ఇదే అంశంపై అఖిలపక్షంతో రాష్ట్రపతి వద్దకు!
  • అన్ని పార్టీలకు లేఖ రాసిన షర్మిల
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో అఖిలపక్షంతో వెళ్లి రాష్ట్రపతిని కలవనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను రాష్ట్రపతికి వివరించాలని ఆమె భావిస్తున్నారు. అఖిలపక్షం కోసం తెలంగాణలోని అన్ని పార్టీలకు షర్మిల లేఖ రాయనున్నారు. షర్మిల ఇవాళ రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ తమిళిసైని కలిశారు. తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. 

ఇప్పుడిదే అంశంపై అఖిలపక్షంతో కలిసి రాష్ట్రపతి వద్దకు వెళ్లి, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రద్దు చేసి, రాష్ట్రపతి పాలన విధించాలని కోరనున్నారు. అటు, తన బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపైనా షర్మిల స్పందించారు. చట్టం తన పని తాను చేసుకుపోతోందని అన్నారు.


More Telugu News