'రుద్రంగి' నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్!

  • తెలంగాణ నేపథ్యంలో నడిచే కథగా 'రుద్రంగి'
  • రసమయి బాలకిషన్ నిర్మించిన సినిమా ఇది
  • ఆసక్తిని పెంచుతూ వాచాహిన అప్ డేట్స్  
  • ఏప్రిల్ 28వ తేదీన విడుదలవుతున్న సినిమా

గతంలో తెలంగాణ నేపథ్యంలో కొన్ని సినిమాలు వచ్చాయి. ఈ ప్రాంతంలోకి ఒక మారుమూల గ్రామంలోని ప్రజల జీవన విధానం .. వారి ఆచారాలు .. నమ్మకాల నేపథ్యంలో వచ్చిన మరో సినిమానే 'రుద్రంగి. రసమయి బాలకిషన్ సొంత బ్యానర్లో ఈ సినిమా నిర్మితమైంది. 

కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. 'త్యాగాలే నిను తలచి తలవంచి .. మొక్కాలే మా తల్లి నీకమ్మా, నవ్వేటి పువ్వులే గోసరిల్లి వసివాడిపోయెనే మా యమ్మా .. రుద్రంగి ' అంటూ ఈ పాట సాగుతోంది. 

నాఫల్ రాజా సంగీతాన్ని సమకూర్చిన ఈ పాటకి మానుకోట ప్రసాద్ సాహిత్యాన్ని అందించగా, కైలాశ్ ఖేర్ ఆలపించాడు. జగపతిబాబు .. విమలా రామన్ .. మమతా మోహన్ దాస్ .. గానవి లక్ష్మణ్ .. కాలకేయ ప్రభాకర్ ప్రధానమైన పాత్రలను పోషించారు. ఏప్రిల్ 28వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.



More Telugu News