ఐపీఎల్ లో ఈ ఐదుగురు అదరగొడతారట.. పేర్లు చెప్పిన గంగూలీ
- యువ ఆటగాళ్లలో పృథ్వి షా, పంత్, రుతురాజ్ గైక్వాడ్, ఉమ్రాన్ మాలిక్, గిల్ బాగా ఆడతారన్న గంగూలీ
- సూర్య కుమార్ యాదవ్ ను యువ ఆటగాడిగా పరిగణనలోకి తీసుకోలేమని వ్యాఖ్య
- నెల రోజుల్లో మొదలు కానున్న ఐపీఎల్
మరో నెల రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదలుకాబోతోంది. దాదాపు రెండు నెలలపాటు ధనాధన్ క్రికెట్ కొనసాగనుంది. ఈ సీజన్ లో ఎవరు అదరగొడతారనే దానిపై టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ తన అభిప్రాయాలను వెల్లడించాడు. ఐదుగురు యువ ఆటగాళ్ల పేర్లను దాదా చెప్పాడు.
ఓ షోలో పాల్గొన్న గంగూలీ.. ఈ సీజన్ లో యువ ఆటగాళ్లలో పృథ్వి షా, రిషభ్ పంత్, రుతురాజ్ గైక్వాడ్, ఉమ్రాన్ మాలిక్, శుభ్ మన్ గిల్ బాగా ఆడతారని చెప్పాడు. ‘‘సూర్య కుమార్ యాదవ్ ను యువ ఆటగాడిగా పరిగణనలోకి తీసుకోలేం. యువ ప్లేయర్లలో పృథ్వీ షా లో ఎంతో ప్రతిభ ఉంది. రిషభ్ పంత్ ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు. ఇక రుతురాజ్ కూడా బాగా ఆడుతున్నాడు. వీళ్లు ముగ్గురు బ్యాట్స్ మన్ బాగా ఆడతారని నేను అనుకుంటున్నా. ఇక బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్. అయితే అతడు ఫిట్ గా ఉంటేనే’’ అని వివరించాడు.
షోలో పాల్గొన్న మాజీ స్పిన్నర్ హర్బజన్ సింగ్.. శుభ్ మన్ గిల్ పేరు ప్రస్తావించాడు. దీంతో గిల్ పేరును కూడా జాబితాలోకి చేరుస్తానని గంగూలీ అన్నాడు. ‘‘నేను మరిచిపోయిన పేరు అదే. ఐదో ప్లేయర్ శుభ్ మన్ గిల్ నే’’ అని చెప్పాడు. అయితే సూర్య కుమార్ యాదవ్ ఈ లిస్టులో టాప్ లో ఉంటాడని దాదా నవ్వేశాడు.