థర్డ్ ఫ్రంట్ తో బీజేపీకే లాభం: కాంగ్రెస్ పార్టీ

  • బీజేపీని ఎదుర్కోవడానికి సెక్యులర్ పార్టీలను కలుపుకుపోవాలి
  • కాంగ్రెస్ సిద్దాంతాలతో ఏకీభవించే పార్టీలను గుర్తించాలి
  • దేశానికి కాంగ్రెస్ మాత్రమే సరైన నాయకత్వాన్ని అందించగలదు
2024 ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి భావసారూప్యత గల సెక్యులర్ పార్టీలను కలుపుకుని ముందుకు పోవాలని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది. ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ లో కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాల్లో ఎన్నికల కార్యాచరణపై తీర్మానం చేసింది. 'గుర్తించడం, సమీకరించడం, కలిసి పని చేయడం' అనే ఫార్ములా ప్రకారం ఇతర పార్టీలతో కలిసి ముందుకు సాగాలని చెప్పింది. సెక్యులర్, సోషలిస్ట్ పార్టీలను ఏకం చేయడమే కాంగ్రెస్ భవిష్యత్ ప్రణాళిక అని తెలిపింది. 

కాంగ్రెస్ సిద్ధాంతాలతో ఏకీభవించే పార్టీలను గుర్తించాలని చెప్పింది. సారూప్య సిద్ధాంతాల ఆధారంగా విపక్ష పార్టీలను తక్షణమే ఏకం చేయాల్సిన అవసరం ఉందని తెలిపింది. థర్డ్ ఫ్రంట్ తో బీజేపీకే లబ్ధి చేకూరుతుందని అభిప్రాయపడింది. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో మన దేశానికి కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే సరైన నాయకత్వాన్ని అందించగలదని చెప్పింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వంటి నేతలు థర్డ్ ఫ్రంట్ గురించి మాట్లాడుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ తీర్మానం ఆసక్తికరంగా మారింది. 



More Telugu News