ఐక్యత అంటే ఇలా ఉండాలి... పారిశ్రామికవేత్త హర్ష్ గోయంకా ట్వీట్

  • ఒక్కటిగా అయితే చాలా నిదానంగానే వెళ్లగలిగే గొంగళి పురుగు
  • గుంపుగా అయితే వేగంగా వెళ్లగలవు
  • ఐకమత్యం బలానికి నిదర్శనమన్న గోయెంకా
ఐకమత్యమే మహాబలం అని పాఠ్యాంశాల్లో చదువుకుని ఉంటారు. దాన్ని అక్షరాలా ఆచరణలో చూపుతున్నాయి గొంగళి పురుగులు. ఇందుకు సంబంధించిన ఒక వీడియోని ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయంకా ట్విట్టర్ లో షేర్ చేశారు. 

ఈ వీడియోను పరిశీలిస్తే.. పదుల సంఖ్యలో గొంగళి పురుగులు కలసి ప్రయాణం చేయడాన్ని చూడొచ్చు. విడిగా ఒక్కోటి అయితే చాలా నిదానంగా పాకుతూ వెళ్లాల్సి వస్తుంది. కానీ, ఒక సమూహంగా ఇవన్నీ ఒక్కచోటకు చేరడం వల్ల.. ఒకదానికొకటి అతుక్కుని వేగంగా సాగిపోగలవు. వీడియోలో అదే కనిపిస్తోంది.

‘‘ఇది కేటర్ పిల్లర్ల గ్రూప్. ఒక గుంపుగా ప్రయాణం చేస్తున్నాయి. ఒక్కటే విడిగా కంటే ఇలా గుంపుగా అయితే వేగంగా వెళ్లగలవు. అదే ఐకమత్యం బలం అంటే..’’ అంటూ హర్ష్ గోయెంకా ట్వీట్ చేశారు. దీనికి యూజర్లు సానుకూలంగా స్పందిస్తున్నారు. కలిసి ఉంటే నిలబడతాం.. విడిపోతే పడిపోతాం అని ఓ యూజర్ కామెంట్ చేశాడు. ‘‘ఎంతో ఉపయోకరమైన అంశాన్ని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. యూనిటీ అనేది ఎంతో శక్తిమంతమైనది. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలదు’’అని మరో యూజర్ పేర్కొన్నాడు.


More Telugu News