పుతిన్ మరో ఏడాది కూడా ఉండరంటున్న బహిష్కృత ఎంపీ
- క్రిమియాని ఉక్రెయిన్ తిరిగి స్వాధీనం చేసుకుంటుందని పొనోమరేవ్ అంచనా
- అదే జరిగితే పుతిన్ పతనం ఖాయమన్న అంచనా
- చుట్టూ ఉన్న వారే పుతిన్ పతనాన్ని కోరుకోవచ్చన్న అభిప్రాయం
రష్యా అధ్యక్షుడు పుతిన్ మరో ఏడాది కూడా ఉండరని, అక్టోబర్ 7న ఆయన తన పుట్టిన రోజును కూడా చూడలేరని ఆ దేశ బహిష్కృత ఎంపీ, ఉక్రెయిన్ లో తలదాచుకుంటున్న ఇల్య పొనోమరేవ్ అంటున్నారు. రష్యా ఫెడరల్ అసెంబ్లీ డిప్యూటీగా లోగడ ఆయన పనిచేశారు. 2014లో ఆయన్ని రష్యా బహిష్కరించింది. ఉక్రెయిన్ క్రిమియాను తిరిగి స్వాధీనం చేసుకోవడంతో పుతిన్ పతనం ప్రారంభం అవుతుందని పొనోమరేవ్ అంచనా వేస్తున్నారు.
రష్యా క్రిమియాని స్వాధీనం చేసుకోవడానికి వ్యతిరేకంగా ఓటు వేసింది పొనోమరేవ్ ఒక్కరే కావడం గమనార్హం. ఎన్నికల్లో రిగ్గింగ్ చేసి పుతిన్ గెలిచినట్టు ఆయన లోగడ బహిరంగంగానే ఆరోపణలు చేశారు. ‘‘ఉక్రెయిన్ ఆర్మీ ఏదో ఒక రోజు క్రిమియాలోకి ప్రవేశిస్తుంది. అది పుతిన్ పాలనకు ముగింపు పలుకుతుంది. పుతిన్ ప్రస్తుతం తాను ఉన్న స్థానం నుంచి చూస్తే.. అలాంటి సైనిక ఓటమిని ఆయన తట్టుకుని నిలబడలేరు’’అని పొనోమరేవ్ అన్నారు. మరో కోణంలో పుతిన్ ను తన అనుయాయులే పడగొట్టొచ్చని కూడా అంచనా వేస్తున్నారు.