సింగిల్ తీస్తుండగా బాబర్‌కు అడ్డొచ్చిన హసన్ అలీ.. బ్యాట్ ఎత్తి భయపెట్టడంతో పరుగో పరుగు: వీడియో ఇదిగో!
- పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో సరదా ఘటన
- ఇస్లామాబాద్-పెషావర్ మధ్య మ్యాచ్‌లో ఘటన
- చివరి బంతికి సింగిల్ రావడంతో బ్యాట్‌ను విసిరికొట్టిన బాబర్
పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో భాగంగా ఇస్లామాబాద్ యునైటెడ్-పెషావర్ జల్మీ మధ్య జరిగిన మ్యాచ్‌లో బౌలర్ హసన్ అలీ, పెషావర్ కెప్టెన్ బాబర్ ఆజం మధ్య సరదా సన్నివేశం చోటుచేసుకుంది. కరాచీ నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. పెషావర్ జల్మీకి ఇది రెండో పరాజయం.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. కెప్టెన్ బాబర్ ఆజం 58 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌తో 75 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 157 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇస్లామాబాద్ 14.5 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. రహ్మానుల్లా గుర్బాజ్ 62, రాసీ వాన్ డెర్ డుసెన్ 42 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
కాగా, మ్యాచ్ మధ్యలో ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. హసన్ అలీ వేసిన బంతిని ఆడిన బాబర్ సింగిల్ కోసం ప్రయత్నించాడు. సగం దూరం వచ్చాక హసన్ మధ్యలో అడ్డంగా ఉండడంతో అతడిని భయపెట్టేందుకు బ్యాట్ ఎత్తాడు. అంతే.. భయపడిపోయిన హసన్ అక్కడి నుంచి పక్కకి పరిగెత్తాడు.
ఇక, ఇన్నింగ్స్ చివరి బంతిని సిక్సర్‌గా మలచాలని భావించిన బాబర్ ప్రయత్నం ఫలించలేదు. ఫలితంగా సింగిల్ మాత్రమే రావడంతో అసహనానికి గురైన బాబర్.. బ్యాట్‌ను నేలకేసి కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాకెక్కి తిరుగుతోంది.