పెద్ద దొరను మరోసారి సీఎం ఎందుకు చేయాలో జర చెప్పు చిన్న దొర: షర్మిల
- మంత్రి కేటీఆర్ పై తీవ్ర విమర్శలు చేసిన వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు
- కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే తెలంగాణ తల్లి తల్లడిల్లదని ఎద్దేవా
- దొరల పాలన విముక్తి కోసం ఆశగా ఎదురుచూస్తోందని వ్యాఖ్య
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పై వైఎస్ఆర్టీపీ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి విమర్శలు చేశారు. కేసీఆర్ ను మరోసారి సీఎం చేయాలన్న కేటీఆర్ ప్రకటనపై తనదైన శైలిలో స్పందించారు. కేసీఆర్ ను మళ్ళీ సీఎం ఎందుకు చేయాలో చెప్పాలంటూ ప్రశ్నల వర్షం కరిపిస్తూ వరుస ట్వీట్లు చేశారు.
‘పెద్ద దొరను సీఎం ఎందుకు చేయాలో జర చెప్పు చిన్న దొర? రాష్ట్రాన్ని అధోగతి పాలుజేసినందుకా? స్కీముల పేరిట స్కాములు చేసినందుకా? కాళేశ్వరం పేరిట లక్ష కోట్లు దోచుకుతిన్నందుకా? పాలమూరును కట్టకుండా దక్షిణ తెలంగాణను ఎడారి చేసినందుకా? 16 వేల కోట్ల మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని.. 4.80 లక్షల కోట్ల అప్పులపాలు చేసినందుకా?’ అంటూ షర్మిల ప్రశ్నలు సంధించారు.
కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే తెలంగాణ తల్లి తల్లడిల్లదు చిన్న దొర అంటూ ఎద్దేవా చేశారు. ‘మీ తాలిబాన్ల పాలనను చూసి, ఎనిమిదేండ్లుగా తెలంగాణ తల్లి తల్లడిల్లుతోంది’ అని షర్మిల విమర్శించారు. దొరల పాలన విముక్తి కోసం ఆశగా ఎదురుచూస్తోందన్నారు. మీ నియంత పాలనను మీ ఫామ్ హౌజ్ కే పరిమితం చేయడానికి తెలంగాణ ప్రజానికం సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.