కళ్లద్దాలు పెట్టుకుని మీడియా సమావేశానికి.. ఎందుకో చెప్పిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్!
- మహిళల టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ లో ఓడిన టీమిండియా
- నా కన్నీళ్లను దేశం చూడకూడదనే కళ్లద్దాలు ధరించానన్న హర్మన్
- మరోసారి దేశాన్ని నిరాశపర్చబోమని మాటిస్తున్నానని వెల్లడి
మహిళల టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ లో టీమిండియా పోరాడి ఓడింది. 5 పరుగుల తేడాతో ఆసీస్ టీమ్ విజయం సాధించింది. చేజింగ్ లో జెమీమా రోడ్రిగ్స్, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, దీప్తి శర్మ రాణించినా ఓటమి తప్పలేదు. హాఫ్ సెంచరీతో మెరిసిన హర్మన్ ప్రీత్ కౌర్.. కీలక సమయంలో రనౌట్ కావడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. తర్వాత వికెట్లన్నీ టపటపా రాలిపోయాయి.
ఈ ఓటమితో హర్మన్ ఎమోషనల్ అయింది. కన్నీరు పెట్టుకున్న ఆమెను అంజుమ్ చోప్రా ఓదార్చింది. తర్వాత జరిగిన మీడియా సమావేశానికి హర్మన్ కళ్లద్దాలు పెట్టుకుని వెళ్లింది. అలా రావడంపై కామెంటేటర్ అడగ్గా ‘‘మ్యాచ్ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాం. కన్నీళ్లు ఆగడం లేదు. నా కన్నీళ్లను దేశం చూడకూడదని అనుకుంటున్నాను. అందుకే కళ్లద్దాలు ధరించా. మెరుగైన ఆట తీరుతో మళ్లీ పుంజుకుంటాం. మరోసారి దేశాన్ని నిరాశపర్చబోమని మాటిస్తున్నాను. నా రనౌట్ కంటే దురదృష్టకరం మరొకటి ఉండదు’’ అని చెప్పుకొచ్చింది.
ఇక మహిళల టీ20 వరల్డ్ కప్ లో రెండో సెమీస్ ఈ రోజు జరగనుంది. ఇంగ్లండ్, సౌతాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. గెలిచిన జట్టు వచ్చే ఆదివారం ఆస్ట్రేలియా టీమ్ తో జరిగే ఫైనల్ లో అమీతుమీ తేల్చుకోనుంది.