అమెరికాకు అయ్యప్ప మాలలో వెళ్లిన రామ్ చరణ్.. అక్కడ సూటు, బూటు ఎలా వేసుకున్నారు?

  • హైదరాబాద్ నుంచి న్యూయార్క్ వెళ్లే సమయంలో అయ్యప్ప దీక్షలో ఉన్న చరణ్
  • అమెరికా వెళ్లిన తర్వాత సూటు, బూటు ఎలా ధరిస్తారంటూ పలువురి అనుమానం
  • 21 రోజుల దీక్ష ముగిసిపోవడమే కారణమన్న చరణ్ టీమ్
టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే. వచ్చే నెల జరగనున్న ఆస్కార్ అవార్డుల కార్యక్రమం కోసం ఆయన ముందుగానే యూఎస్ కు వెళ్లారు. అక్కడ పలు కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు. అక్కడి మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. 

మరోవైపు, రామ్ చరణ్ అమెరికాకు వెళ్లేటప్పుడు అయ్యప్ప మాలలో ఉన్న సంగతి తెలిసిందే. నల్లటి దుస్తులు ధరించి, కాళ్లకు చెప్పులు లేకుండా ఎయిర్ పోర్టులో ఆయన వెళ్తున్న ఫొటోలు వైరల్ అయ్యాయి. అయితే, అమెరికాలో మాత్రం ఆయన అయ్యప్ప మాలలో లేకుండా... సూటు, బూటు ధరించి స్టైలిష్ గా కనిపించడం చాలా మందిని అయోమయానికి గురి చేసింది. అయ్యప్ప మాలలో ఉన్న వ్యక్తి సూటు, బూటు ఎలా వేసుకుంటారని పలువురు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు రామ్ చరణ్ టీమ్ సమాధానమిచ్చింది. 

హైదరాబాద్ నుంచి న్యూయార్క్ కు వెళ్లేటప్పుడు రామ్ చరణ్ అయ్యప్ప దీక్షలో ఉన్నారని... అక్కడకు వెళ్లిన తర్వాత 21 రోజుల దీక్ష ముగిసి పోయిందని... దీంతో, అక్కడే చరణ్ దీక్షను విరమించారని ఆయన టీమ్ వెల్లడించింది.


More Telugu News