అజిత్ 62వ సినిమా టైటిల్ ఇదేనట!

అజిత్ 62వ సినిమా టైటిల్ ఇదేనట!
  • ఇటీవలే 'తెగింపు'తో పలకరించిన అజిత్ 
  • తెలుగులో అంతగా ఆకట్టుకోని సినిమా
  • ఆయన 62వ సినిమా నిర్మాణ సంస్థగా లైకా
  • పరిశీలనలో ఉన్న టైటిల్ గా 'డెవిల్'
  • ఇదే టైటిల్ తో ఇక్కడ సినిమా చేస్తున్న కల్యాణ్ రామ్
కోలీవుడ్ స్టార్ హీరోల విషయానికే వస్తే, ఒక సినిమాకి .. మరొక సినిమాకి మధ్య వాళ్లు ఎక్కువ గ్యాప్ తీసుకోరు. చకచకా ఆ తరువాత ప్రాజెక్టులను లైన్లో పెట్టేస్తుంటారు. అలా అజిత్ కూడా 'తునీవు' తర్వాత మరో సినిమాను పట్టాలెక్కించడానికి రెడీ అవుతున్నాడు. కెరియర్ పరంగా ఇది ఆయనకు 62వ సినిమా. 

లైకా ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాను నిర్మించడానికి ముందుకు వచ్చారు. దర్శకులుగా విష్ణువర్ధన్ - ఎమ్. తిరుమేని పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి 'డెవిల్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. దాదాపు అదే టైటిల్ ను ఖరారు చేయవచ్చని అంటున్నారు. మార్చి 2వ వారంలో టైటిల్ విషయంలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. 

అయితే ఇదే టైటిల్ తో కల్యాణ్ రామ్ ఇక్కడ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అజిత్ సినిమాలో కథానాయిక ఎవరు? ప్రతినాయకుడు ఎవరు? అనే విషయంలో క్లారిటీ రావలసి ఉంది. అనిరుధ్ ను సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి.


More Telugu News