అమెరికాలో మళ్లీ మంచు తుపాను బీభత్సం.. 1500 విమానాల రద్దు, రోడ్ల మూసివేత
- ఉత్తరాది, పశ్చిమ మధ్య ప్రాంతాలపై పెను ప్రభావం
- చాలా ప్రాంతాల్లో విద్యుత్ కు అంతరాయం
- రహదారులను మూసి వేస్తున్న అధికారులు
అమెరికాను మంచు తుపాను మరోసారి వణికిస్తోంది. అమెరికాలోని ఉత్తరాది, పశ్చిమ మధ్య రాష్ట్రాల్లో భారీ హిమపాతం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీని కారణంగా కాలిఫోర్నియాలో విద్యుత్తుకు అంతరాయం ఏర్పడటంతో ప్రజలంతా చీకట్లోనే గడిపేస్తున్నారు. అరిజోనా నుంచి వ్యోమింగ్ వరకు అంతర్రాష్ట్ర రహదారులను మూసివేశారు. 1,500 కంటే ఎక్కువ విమానాలను రద్దు చేశారు. కొన్ని ప్రదేశాల్లో తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. మిడ్ వెస్ట్, మిడ్-అట్లాంటిక్, ఆగ్నేయ ప్రాంతాల్లోని నగరాల్లో గతంలో ఎప్పుడూ చూడని పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా ఉత్తరాది ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పాఠశాలలు, కార్యాలయాలను మూసివేశారు, మిన్నెసోటా శాసనసభను కూడా మూసివేయాల్సి వచ్చింది. ప్రయాణాలు కష్టతరం అయ్యాయి. బుధవారం ఒక్క రోజే 1,500 కంటే ఎక్కువ విమానాలు రద్దు చేయాల్సి వచ్చింది. వాటిలో 400 కంటే ఎక్కువ సర్వీస్ లు మిన్నియాపాలిస్-సెయింట్ పాల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు చేస్తున్నవే. దేశవ్యాప్తంగా మరో 5,000కు పైగా విమానాలు ఆలస్యంగా నడిచాయి. రహదారులపై కూడా మంచు కూరుకుపోయింది. చాలా రహదారులను మూసివేయడంతో ప్రజలంతా ఎక్కడికక్కడే నిలిచిపోయారు.