హిండెన్‌బర్గ్ నివేదికతో ‘అదానీ’కి క్రమశిక్షణ: ఆర్థికవేత్త స్వామినాథన్
- హిండెన్‌బర్గ్ అదానీ గ్రూప్ పాలిట దీవెన అన్న స్వామినాథన్
- పెట్టుబడిదారులు మరింత జాగరూకతతో వ్యవహరించవచ్చని కామెంట్
- నివేదికతో అంతిమంగా అదానీ సంస్థలకే లాభమని ప్రకటన
హిండెన్‌బర్గ్ నివేదికతో అదానీ గ్రూప్‌కు ఆర్థిక క్రమశిక్షణ అలవడొచ్చని ప్రముఖ ఆర్థికవేత్త స్వామినాథన్ అయ్యర్ తాజాగా ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ నివేదిక అదానీ గ్రూప్ పాలిట దీవెనగా మారొచ్చని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఎకనమిక్ టైమ్స్ పత్రికలో ఆయన ఓ వ్యాసం రాశారు.
‘‘ నాకు తెలిసి.. అదానీ గ్రూప్ సంస్థలకు హిండెన్‌బర్గ్‌కు మించిన మేలు మరొకటి లేదు. విభిన్న రంగాలకు వేగంగా విస్తరిస్తున్న సంస్థ ఇకపై కాస్తంత నెమ్మదించొచ్చు. అంతేకాకుండా.. సంస్థలో పెట్టుబడి పెట్టిన వారందరూ భవిష్యత్తులో మరింత జాగరూకతతో వ్యవహరించవచ్చు. తద్వారా సంస్థకు ఆర్థిక క్రమశిక్షణ అలవడుతుంది. అంతిమంగా అది ఆదానీ గ్రూప్‌కు ప్రయోజనమే’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తన వద్ద ఆదానీ సంస్థల షేర్లు ఏవీ లేవని ఆయన చెప్పారు. షేర్ల అధిక ధరలు, రిస్కే ఇందుకు కారణమని పేర్కొన్నాయి. అయితే.. భవిష్యత్తులో తాను అదానీ సంస్థల షేర్లు కొనుగోలు చేయొచ్చని కూడా పేర్కొన్నారు.
అదానీ గ్రూప్ అప్పులకుప్పగా మారిందన్న హిండెన్‌బర్గ్ నివేదిక తరువాత గ్రూప్‌లోని ఏడు లిస్టెడ్ కంపెనీలు మొత్తం 125 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువన కోల్పోయిన విషయం తెలిసిందే.