సన్ రైజర్స్ హైదరాబాద్ కు కొత్త కెప్టెన్ వచ్చేశాడు
- దక్షిణాఫ్రికా బ్యాటర్ ఐడెన్ మార్ క్రమ్ కు కెప్టెన్సీ పగ్గాలు
- ఇటీవల సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ కు కెప్టెన్ గా ఉన్న మార్ క్రమ్
- మార్చి 31వ తేదీ నుంచి ఐపీఎల్ 16వ సీజన్
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ కొత్త సీజన్ ను కొత్త కెప్టెన్ తో ఆరంభించనుంది. తమ నూతన సారధిగా దక్షిణాఫ్రికా క్రికెటర్ ఐడెన్ మార్ క్రమ్ ను ప్రకటించింది. ఇటీవల జరిగిన సౌతాఫ్రికా టీ20 క్రికెట్ లీగ్ లో టైటిల్ నెగ్గిన సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టుకు మార్ క్రమ్ కెప్టెన్ గా ఉన్నాడు. అతని నాయకత్వంలోని జట్టు ఆ లీగ్ లో అద్భుత ప్రదర్శన చేసింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బాధ్యతలను యాజమాన్యం అతనికి అప్పగించింది.
గతంలో తమకు ఐపీఎల్ ట్రోఫీని అందించిన డేవిడ్ వార్నర్ తో పాటు చాన్నాళ్లు కెప్టెన్ గా వ్యవహరించిన కేన్ విలియమ్సన్ ను సన్ రైజర్స్ వదులుకుంది. ఈ సీజన్ వేలంలో భువనేశ్వర్ కుమార్, మార్ క్రమ్ లను రిటైన్ చేసుకోవడంతో పాటు పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ను కొనుగోలు చేసింది. అతనికే కెప్టెన్సీ ఇస్తారన్న ప్రచారం జరిగినా.. మరోసారి విదేశీయుడికే మొగ్గు చూపింది. కాగా, ఐపీఎల్ 16వ సీజన్ మార్చి 31వ తేదీన మొదలవనుంది.